/rtv/media/media_files/2025/10/09/bonthu-2025-10-09-20-31-41.jpg)
జూబ్లీహిల్స్ బీజేపీ(bjp) అభ్యర్థిగా కాంగ్రెస్(congress) నేత బొంతు రామ్మోహన్(bonthu-rammohan) అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలపై ఆయన స్పందించారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తాను లేనన్న ఆయన.. బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు, నా అభ్యర్థిత్వంపై బీజేపీ అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఉంటానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో నేను సంతృప్తికరంగా ఉన్నానని బొంతు రామ్మోహన్ వెల్లడించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో పని చేశాడని.. మనవాడని పార్టీ నేతలకు చెప్పినట్లుగా చర్చ నడించింది. కాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుధీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది.
మొత్తం 12 మంది పోటీకి సిద్ధం కాగా.. ఇందులో ఆరుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి నివేదిక ఇచ్చింది. రేసులో ఆకుల లలిత, కీర్తి రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థిని ఫైనల్ చేయనుంది.
Also Read : వైసీపీ నేత పేరు చెప్పి రూ.18 కోట్ల మోసం
తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు..
ఏబీవీపీతో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన బొంతు రామ్మోహన్.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయనకు జీహెచ్ఎంసీ మేయర్ గా అవకాశం కల్పించింది టీఆర్ఎస్. అయితే.. ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన రామ్మోహన్ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
సికింద్రాబాద్ ఎంపీగా ఆయనకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో అక్కడైనా ఛాన్స్ ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ను కోరుతూ వచ్చారు. కానీ స్థానిక నేత నవీన్ యాదవ్ వైపే ఆ పార్టీ మొగ్గు చూపింది. విషయం తెలుసుకున్న రామ్మోహన్ అభ్యర్థి ప్రకటనకు ఒక రోజు ముందే తాను రేసులో లేనని ప్రకటించారు. పార్టీపై అసంతృప్తితోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ ఛాన్స్ ఇస్తే ఆ పార్టీలోకి చేరే అవకాశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు టచ్ లోకి రావడంతోనే బొంతు రామ్మోహన్ పేరును నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రతిపాదించినట్లు స్పష్టం అవుతోంది.
Also Read : హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్