/rtv/media/media_files/2025/02/15/uQJSmg7SocyA5nl8LTZh.jpg)
Bike Scam
హైదరాబాద్ లో బైక్ లు చోరీ (Bikes Scam) జరిగాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఆర్మూర్ లో విక్రయిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. మొత్తం 24 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ స్కాంలో జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కింగ్ కోఠి నుంచి బైక్ లు తీసుకెళ్లి ఆర్మూర్ లో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
Bikes Scam In Nizamabad District
ఈ స్కాం వెనుక ఒక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన బావమరిది సంతోష్ రెడ్డి, పలువురు అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ స్కాంలో కొందరు ముఠాగా ఏర్పడి దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కింగ్ కోఠిలో కొంతమంది కొత్త బైక్ లను విక్రయించే ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏజెన్సీలు వివిధ కంపెనీలకు చెందిన కొత్త బైకులను కొని వాటిని వినియోగదారులకు అమ్మకుండా, చోరికి గురయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.ఆ బోగస్ ఏజెన్సీల మాటలు నమ్మి పోలీసులు కేసులు నమోదు చేయగా, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా బోగస్ సంస్థలు బైకులకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు.ఆ తర్వాత బైకులను ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామాల్లో అమాయకులకు అమ్ముతూ మరోసారి సొమ్ము చేసుకుంటున్నారు.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
Also Read : మస్తాన్ సాయికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు: ఇక జైల్లోనే!
హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఇచ్చిన సమాచారంతో ఆర్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు ముఠా బైక్ ల బీమా సొమ్ము కాజేసే తీరును చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ స్కాంలో సూత్రదారుల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ప్రస్తుతం 24 బైకులు స్వాధీనం చేసుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో బైకుల విక్రయలు జరిగాయనేది పోలీసుల అనుమానం. మరికొన్ని బైకులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ బైకుల స్కాం గురించి ఆరా తీసిన పోలీసులు ఆర్ముర్‌లో భారీ ఎత్తున ఇలా దొంగ బైకులను అమ్మినట్టు గుర్తించారు. దీనివెనుక రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొంది. ఈ బైకుల స్కాం వెనుక ఎమ్మెల్యే పాత్రతో పాటు బావమరిది సంతోష్ రెడ్డి, పలువురు ముఖ్య అనుచరులు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!