/rtv/media/media_files/2025/02/21/wN0gqRNVxd9uxI8FCgpc.webp)
Harish-Rao-Chakradhar
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ముఖ్యంగా పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో జైలు నుంచి విడుదలయిన ముగ్గురిలో ఒకరైన వంశీకృష్ణ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తమకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
ఇది కూడా చదవండి: Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!
నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు..
గతంలో మాజీమంత్రి హరీష్ రావు దగ్గర పనిచేశామని, కానీ ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కేవలం మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలని మాత్రమే తమను పోలీసులు ఇబ్బందులు గురి చేశారన్నారు. అక్రమంగా ఈ కేసులో తమను ఇరికించారని ఆరోపించారు. తమపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్ దగ్గర కూడా గతంలో తాను పనిచేసినట్లు తెలిపారు. చక్రధర్ గౌడ్ ఎన్ని మోసాలు చేశాడో తనకు తెలుసన్నారు. అవన్నీ కూడా ఎప్పుడు బయట పెట్టలేదని.. ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసేంత స్థాయి తమది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాగైనా హరీష్ రావు పేరు చెప్పించాలని ఉద్దేశంతో తమను వేధింపులకు గురి చేశారన్నారు. పోలీసుల వేధింపులపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని.. విచారణ పేరుతో గంటల తరబడి తమను వేధింపులు గురి చేశారని వాపోయారు.
Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?
హరీష్ రావు పేరు చెప్పకపోతే నీకు జీవితం ఉండదు, నీ ఉద్యోగం లేకుండా చేస్తామని డీసీపీ, ఏసీపీ బెదిరించారని వంశీకృష్ణ ఆరోపించారు. నా కుటుంబ సభ్యులను డీసీపీ పరుష పదజాలంతో దూషించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆధారాలు లేకపోవడంతో తమ ద్వారా ఆయన పేరు చెప్పించాలని పోలీసులు ప్రయత్నం చేశారన్నారు. తాము కిందిస్థాయి ఉద్యోగులమే అని తమకు పెద్ద పెద్ద విషయాలు ఏమి తెలియవని అన్నారు.మాపై అక్రమంగా కేసులు పెట్టిన చక్రధర గౌడ్ పైన, పోలీసులపైన న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.
Also Read: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
Also Read: TTD: తప్పు చేశా క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్!