/rtv/media/media_files/2025/02/21/RtVOUQ1G8pyQl5gphKx8.jpg)
ttd issue Photograph: (ttd issue)
TTD: టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌కు క్షమాపణలు చెప్పాడు. క్షణికావేశంలో తప్పు చేశానని, కలసికట్టుగా మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఐ యామ్ సారీ .. మేమంతా ఒక కుటుంబం.. ఈ విషయాన్నీ పొడిగించకండి..
— RTV (@RTVnewsnetwork) February 21, 2025
తిరుమల టీటీడీ ఉద్యోగి బాలాజీ పై దూషణకు దిగిన టీటీడీ బోర్డ్ మెంబర్ నరేష్ కుమార్.. #TTD#NareshKumar#Tirumala#RTVhttps://t.co/CLlspH9RJNpic.twitter.com/mF89wSdFPb
బాధ్యత రహితంగా వ్యవహరించాను..
ఈ మేరకు వివాదంపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు పాలకమండలి సభ్యులతో, అధికారులతో చర్చలు జరుపుతున్నారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ పట్ల తాను బాధ్యత రహితంగా వ్యవహరించానని నరేష్ కుమార్ పశ్చాత్తాప పడ్డారు. భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. క్షణికావేశంలో చేసిన తప్పు. ఆయన కుటుంబ సభ్యులు సైతం పశ్చాత్తాపపడ్డారు. సంస్థ ప్రతిష్ట కాపాడే విధంగా అందరం కృషి చేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే..
మంగళవారం ఉదయం కర్ణాటకకు చెందిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం దగ్గరకు రాగా.. నరేష్ కుమార్ తో పాటు వచ్చిన సహాయ వ్యక్తి గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని అడిగారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని.. ఒకవేళ దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను కలవాలని బాలాజీ చెప్పారు. ఆ వెంటనే పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగిని దూషించారు. 'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. ఏయ్ నువ్వు బయటకు పోవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు పెట్టారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు పో, ఏం మాట్లాడుతున్నావు' అంటూ రెచ్చిపోయారు. వెంటనే అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సురేంద్ర, పోటు ఏఈవో మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపించారు.
ఇది కూడా చదవండి: LAVANYA: నాకు వాడు కాదు వీడు కావాలి.. లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్, ఆడియో వైరల్!
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌కుమార్‌కి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్‌ను తక్షణం తొలగించాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర టీటీడీ ఉద్యోగిని తిట్టిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Making of Chhaava: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న విక్కీ కౌశల్ జిమ్ వీడియో..!