/rtv/media/media_files/2025/07/15/surveyor-tejeshwar-case-2025-07-15-20-06-55.jpg)
Surveyor Tejeshwar Case
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన వాడి మోజులో పడి ఐశ్వర్య సుపారీ గ్యాంగ్‌తో భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. అయితే భర్త చనిపోతే తన కంట్లో కన్నీళ్లు కూడా రావడం లేదని కుటుంబ సభ్యులు అనుమానించారు. తాజాగా ఆమె గదిలో గ్లిజరిన్ సీసాను గుర్తించారు. తనకి ఏడుపు రావడం లేదని ఇతరులు అనుమానించకుండా ఉండాలని కన్నీళ్లు వచ్చేలా కంటిలో గ్లిజరిన్ వేసుకుంది. తాజాగా గ్లిజరిన్ సీసాను పోలీసులు ఇటీవల ఐశ్వర్య గదిలో గుర్తించారు.
ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!
స్పై కెమెరాలు..
ప్రియుడు తిరుమలరావుతో ఐశ్వర్య ఐదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉంది. అయితే వీరిద్దరి ఎలంటి కలయిక ఉండకూడదని తిరుమలరావు.. తేజేశ్వర్ బెడ్ రూంలో స్పై కెమెరాను అమర్చాడు. నిత్యం వారు ఏం చేస్తున్నారని ఈ కెమెరా ద్వారా చూసేవాడట. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఏ2 సహస్రను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు పీటీ వారెంట్‌ను కోర్టుకు సమర్పించారు. అయితే ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యతో సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
ఇదిలా ఉండగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా తిరుమలరావుతో ఫోన్‌లో టచ్‌లో ఉండేది. భర్త తేజేశ్వర్, వాళ్ల కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు తిరుమలరావు ఓ వాయిస్ ఛేంజర్ డివైజ్ ను కొనుగోలు చేశాడు. దీని సాయంతో మహిళ గొంతుగా ఐశ్వర్యతో మాట్లాడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ డివైస్ ను పోలీసులు కర్నూలులో తిరుమలరావు పనిచేసే బ్యాంకులో స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
తేజేశ్వర్ బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అని భావించిన ఐశ్వర్య అతన్ని వెంటనే చంపేయాలని ప్రియుడిన రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే సుపారీ ఇచ్చి మరి తేజేశ్వర్‌ను హత్య చేశారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. హత్య తర్వాత లడఖ్ లేదా అండమాన్ వంటి ప్రాంతాలకు పారిపోవాలని, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని కూడా ప్రణాళిక వేసుకున్నారు.
ఇది కూడా చూడండి:Vivo X Fold 5 Price India: అమేజింగ్.. 16GB ర్యామ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అదిరింది మచ్చా!
jogulamba-gadwala | Surveyor Tejeshwar Case