/rtv/media/media_files/2025/05/15/deHcf29AlYR5MRX25A91.jpg)
MLA Padi Kaushik Reddy
MLA Padi Kaushik Reddy : ఎప్పుడు వివాదాల్లో ఉండే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉండే మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఇటీవల నిర్వహించిన గ్రూపు 1పరీక్షల్లో తన కోడలితోపాటు, తాను అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాములు నాయక్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Also Read : పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన భర్త.. గుర్తుపట్టలేకపోయానంటూ భార్య ఎమోషనల్
ఏప్రిల్ 14న విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాడి కౌశిక్‌రెడ్డి గ్రూప్ -1 పరీక్షలు జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ క్రమంలో రాములునాయక్ కోడలికి ఫస్ట్ ర్యాంక్ రావడం వెనక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. టీజీఎస్ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, ఇందులో రాములు నాయక్ అతని కోడలు కడావత్ రోజాబాయి ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు.
Also read : Miss World Competition : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?
అయితే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ, తమపై నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాములు నాయక్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీం తో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, కౌశిక్‌రెడ్డి మాట్లాడింది బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోకి రావడంతో బుధవారం కేసును బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు.. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ సభ్యుడిగా వ్యవరిస్తున్నారు.
Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!
Follow Us