/rtv/media/media_files/2025/10/04/tg-rtc-bus-fare-hike-2025-10-04-21-30-29.jpg)
TG RTC bus fare hike
TG RTC : హైదరాబాద్ ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మెట్రో డీలక్స్ , ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంచనున్నారు. అయితే, పెరిగిన అదనపు బస్సు చార్జీలు ఈనెల 6 నుంచి అమల్లోకి రానున్నట్లుగా తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కాగా ఆయా బస్సుల్లో ఆడవారికి మహాలక్ష్మీ టికెట్ పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా ప్రస్తుతం పెంచిన భారం మగవారిపైనే పడనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా
Also Read: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ఇద్దరు..