/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
Serious road accident in Siddipet district.
SDPT ACCIDENT : సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం కరీంనగర్ కు చెందిన సుమన్ అనే వ్యక్తి తన భార్య వీణావాణి, ఇద్దరు ఆడపిల్లలలను తీసుకుని దసరా పండుగ సందర్భంగా సొంతూరు అయిన వింజంపల్లికి వెళ్లాడు. కాగా ఈ రోజు కరీంనగర్‌కు తిరిగి వస్తుండగా దేవక్కపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో సీతాఫలాలు కొనివ్వమని పిల్లలు అడగడంతో రోడ్డు పక్కన బైక్ ఆపి సీతాఫలాలు కొనిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి ఉన్న DCM డ్రైవర్ మద్యం మత్తుల్లో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్‌తోపాటు డీసీఎం వ్యాన్ అదే స్పీడుతో వెళ్లి రోడ్డు పక్కన సీతాఫలాలు కొంటున్న సుమన్ కుటుంబాన్ని ఢీకొట్టాయి.
రోడ్డుపక్కన ఆగిఉన్న బైక్‌తో పాటు సుమన్ కుటుంబాన్ని రెండు వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదంలో తల్లి వీణా వాణి, చిన్న కూతురు మనస్విని స్పాట్‌లోనే మృతి చెందారు. పెద్ద కూతురుతో పాటు తండ్రి సుమన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన డీసీఎం, ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెండగంతో ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది.
Also Read: పరువు తీశారు.. సింగపూర్ హోటల్లో సెక్స్ వర్కర్లను దోచుకున్న ఇండియన్ టూరిస్టులు!