Amit Shah: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

New Update
Amit shah

Amit shah

మావోయిస్టులను నిర్మూలించి దిశగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిపిందే. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ఇటీవల మావోయిస్టు సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

Also Read: బయటపడ్డ పాకిస్థాన్‌ దొంగబుద్ధి.. ఢిల్లీలో పాక్‌ ISI నియామకాలు

లొంగిపోయేందుకు మావోయిస్టులు ముందుకొస్తే స్వాగతిస్తామని.. వాళ్లందరికీ పునరావాసం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. '' మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ వాళ్లతో మాట్లాడేందుకు ఏముంది ?. బస్తర్ జిల్లావ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆయుధాలు పట్టుకొని శాంతికి విఘాతం కలిగించే వాళ్లకు భద్రత బలగాలే తగిన సమాధానం ఇస్తాయి. 

Also Read: పాకిస్తాన్ సైన్య గౌరవం POKలో వేలం.. యూనిఫాంల నుండి హెల్మెట్ల వరకు ప్రతిదీ రూ. 10

2026 మార్చి 31 నాటికి భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారుతుంది. ఆ తర్వాత గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరు. గత పదేళ్లలో చూసుకుంటే మోదీ సర్కార్‌ ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించింది. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని'' అమిత్‌ షా పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు