ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!

సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు లక్షల కోట్లు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 80 ఏళ్ల వృద్ధుడు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఏకంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు.

New Update
honey trap

Honey trap In Mumbai

సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు లక్షల కోట్లు పోగొట్టుకుంటున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 80 ఏళ్ల వృద్ధుడు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఏకంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. డబ్బున్న వారినే టార్గెట్ చేసుకొని ఇలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలతో పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా ప్రజలు మళ్లీ మళ్లీ కొత్త కొత్త కుట్రలతో దుండగులు డబ్బులు కాజేస్తున్నారు. ముంబైలో నివసించే ఆ వృద్ధుడు 2023 ఏప్రిల్‌లో షార్వి అనే మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె మొదట తిరస్కరించినా, కొన్ని రోజుల తర్వాత ఆమె అతడికి మళ్లీ రిక్వెస్ట్ పంపింది. దీంతో అతడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. హాయ్ నుంచి మొదలైన వారి సంభాషణ.. ఆ తర్వాత వాట్సాప్‌ నెంబర్లు ఇచ్చుపుచ్చుకునే దాకా వెళ్లింది. ఇద్దరు రోజు తరుచుగా మాట్లాడుకునేవారు. షార్వి తన భర్త నుంచి విడిపోయిందని, తన పిల్లలతో ఒంటరిగా ఉంటోందని చెప్పి, ఆర్థికంగా సహాయం చేయమని కోరింది. ఆ వృద్ధుడు ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. ఇలాగే మరో మూడు అకౌంట్లతో వృద్దుడు చాట్ చేసేవాడు.

ఒకరి తర్వాత ఒకరి మోసం

షార్వి తన పిల్లలకు ఆరోగ్యం బాలేదని చెప్పి.. పలు మార్లు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు తీసుకుంది. తర్వాత కవిత అనే మరో మహిళ షార్వి ద్వారా పరిచయం అయినట్లు చెప్పి, అసభ్యకరమైన సందేశాలు పంపుతూ డబ్బు డిమాండ్ చేసింది. అలాగే దినాజ్ అనే అకౌంట్ నుంచి అతడికి మెసేజ్ వచ్చింది. తాను షార్వి సోదరినని చెప్పి, షార్వి చనిపోయిందని అబద్ధం చెప్పి, ఆమె ఆసుపత్రి బిల్లులు చెల్లించమని డబ్బు వసూలు చేసింది. ఆ తర్వాత అతనితో పెళ్లి చేసుకోవాలని ఆశలు రేకెత్తించి మరింత డబ్బు గుంజింది. ఇంత జరిగినా వృద్ధడికి బుద్ధి రాలే.. జాస్మిన్ అనే మరో మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేశాడు. ఆమె దినాజ్ ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంది. కల్లబొళ్లి మాటలతో డబ్బు అవసరాలకు వృద్ధడి నుంచి డబ్బులు పంపించుకుంది. అలా 21 నెలల్లో  నాలుగు అకౌంట్లకు 734 సార్లు డబ్బులు పంపించాడు. పాపం.. దాదాపు రూ. 8.7 కోట్లు వారు కాజేశారు. 

బయటపడిందిలా..

చివరికి తన వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో, తన కోడలి దగ్గర రూ.2 లక్షలు, తర్వాత కొడుకు దగ్గర రూ.5 లక్షలు అడిగాడు. అప్పుడు అనుమానం వచ్చిన కొడుకు నిలదీయగా, మొత్తం విషయం బయటపడింది. తాను మోసపోయానని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనైన వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి డెమెన్షియా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. జూలై 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు మహిళల పేర్లు ఉన్నప్పటికీ, ఒకే వ్యక్తి వేర్వేరు నంబర్లతో మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు