/rtv/media/media_files/2025/02/25/njk1M0ge2TS5XMHWkFXe.jpg)
Bhatti Vikramarka PA Srinivas dies of heart attack
Batti vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. భట్టి పర్సనల్ అసిస్టెంట్ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDSలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్‌పై 6ఏళ్లకు భట్టికి PAగా విధులు నిర్వహిస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/25/oynWBQDpAz5t9TCVx81z.jpg)
సొంత ఇంటిలోనే కన్నుమూత..
ఈ మేరకు ఖమ్మం బైపాస్ రోడ్‌లోని టీఎన్జీవోస్ కాలనీలో ఆయన సొంత ఇంటిలోనే సోమవారం కన్నుమూశారు. ఖమ్మంలోని భట్టి క్యాంప్ కార్యాలయానికి వెళ్లడానికి ఉదయం సిద్ధమవుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, సహా పలువురు ప్రముఖులు, ఆఫీసర్లు, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
/rtv/media/media_files/2025/02/25/jJ8bv2uHkYTAG9MimxJK.jpg)
ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!
రాత్రి భట్టి విక్రమార్క శ్రీనివాస్ ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన భట్టి శ్రీనివాసరావు నిబద్ధత, నిస్వార్థ సేవలు మరువలేనివని కొనియాడారు. కురవి మండలం సీరోలుకు చెందిన శ్రీనివాసరావు ఖమ్మం కరుణగిరి సమీపాన టీఎన్జీఓస్ కాలనీలో స్థిరపడ్డారు.
ఇది కూడా చదవండి: TG LAWCET Schedule 2025: తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే
Follow Us