కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ(bjp) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల(jubliee hills by election) ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం బోరబండ డివిజన్లో బీజేపీ అభ్యర్థి విజయాన్ని కోరుతూ సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆయన కీలక కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు గుప్పిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read : కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
MIM నేతలు టోపీ పెట్టుకోలేదు కానీ
రోడ్ షోలో అజహరుద్దీన్, MIM నేతలు టోపీ పెట్టుకోలేదు కానీ ఓట్ల కోసం సీఎం రేవంత్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ టోపీ పెట్టుకున్నారని అన్నారు. తాను హిందూ ధర్మం కాపాడేవాడినని, అలా అని మరో మతాన్ని తాను కించపరుచనని చెప్పారు. ఆ టోపీ పెట్టుకోవాల్సిన రోజు వస్తే తన తల నరుక్కుంటానని అన్నారు. లక్ష ఓట్లకోసం ఒవైసీతో కలిసిన కాంగ్రెస్‌కు మంత్రి అజహరుద్దీన్ తో వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read : మందుబాబులకు బిగ్ షాక్.. 4 రోజులు వైన్ షాపులు బంద్
అంతేకాకుండా ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అంటూ నిలదీశారు. జూబ్లీహిల్స్ హిందువులంతా ఆలోచించాలని, 70శాతం ఓట్ల సత్తా ఏందో చూపించి బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ సంజయ్ ఓటర్లను కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MIM, కాంగ్రెస్ పార్టీలు కలిసి తెలంగాణను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనిని అడ్డుకోవడానికి హిందువులు ఏకమవ్వాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హిందువులందరూ ఏకమై 'సింగిల్ ఓటు బ్యాంకు'గా మారాలని పిలుపునిచ్చారు.
Bandi Sanjay : నా తల నరుక్కుంటా, కానీ ఆ టోపీ పెట్టుకోను...బండి సంజయ్ సంచలన కామెంట్స్
కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా . గురువారం సాయంత్రం బోరబండ డివిజన్లో బీజేపీ అభ్యర్థి విజయాన్ని కోరుతూ సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు.