/rtv/media/media_files/2025/09/06/balapur-ganesh-2025-09-06-11-53-18.jpeg)
Balapur Ganesh
హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గరకు చేరుకున్నాడు. ఈ సమయంలో చెట్లు, వైర్లు వంటివి అడ్డు రాకుండా ఉండేందుకు ఉత్సవ్ కమిటీ ముందుగానే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలాపూర్ గణేష్ విషయంలో కూడా కమిటి సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
బాలాపూర్ గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధం
— Telangana365 (@Telangana365) September 6, 2025
ఈసారి కాస్త ఆలస్యంగానే శోభాయాత్ర ప్రారంభమయ్యే అవకాశం#balapurganeshpic.twitter.com/kGCaKyG1mT
కరెంట్ వైర్ల నుంచి ఇబ్బంది రాకుండా..
భారీగా ఉన్న బాలాపూర్ గణపతి(Balapur Ganapati)ని నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విగ్రహానికి ఇరువైపులా ఉండే శంఖుచక్రాలను కమిటీ సభ్యులు తొలగించారు. ఇవి భారీగా, పొడవుగా ఉండటం వల్ల శోభాయాత్ర సమయంలో కరెంట్ వైర్లు, చెట్లు కొమ్మలు, ఫ్లైఓవర్లు వంటివి అడ్డు వస్తుంటాయి. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీటిని తొలగించినట్లు తెలుస్తోంంది. అయితే బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు బయలుదేరింది.
బాలాపూర్ గణేశుడి లడ్డు పై కూర్చున్న వ్యక్తి.. అపచారం అంటున్న భక్తులు.. #balapurganesh#BalapurLaddu#GaneshNimajjanam2025#Hyderabad#RTVpic.twitter.com/D0zwphrzQW
— RTV (@RTVnewsnetwork) September 6, 2025
ఇదిలా ఉండగా బాలాపూర్ లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే ఈ సారి ఈ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాట రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా కర్మన్ ఘూట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. గత కొన్నే్ళ్ల నుంచి ఇతను లడ్డూ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఆ అదృష్టం దక్కిందని సంతోషపడుతున్నారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!