/rtv/media/media_files/2025/07/17/attempted-murder-on-congress-leader-2025-07-17-21-19-44.jpg)
Attempted murder on Congress leader
Breaking News :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆషాడ బోనాల సందర్భంగా చిలకమర్రి గ్రామంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి పై అదే గ్రామానికి చెందిన ధ్యాప శివ కృష్ణారెడ్డి అలియాస్ కోటి బ్లేడుతో దాడి చేశాడు. బ్లేడుతో గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు
కాగా ఘర్షణ విషయం తెలిసి అందరూ అక్కడికి చేరుకునే లోపే రవీందర్ రెడ్డి గొంతు కోశారు. అదే సమయంలో ఆయన పక్కనే ఉన్న సత్యం రెడ్డి ఆపడానికి ప్రయత్నించగా అతనిపై కూడా దాడి చేయడంతో ఆయనకు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రవీందర్ రెడ్డికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను గ్రామస్తులు వెంటనే అతని పట్టణంలోని గాయత్రి ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. పాత గొడవల కారణాంగానే ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : రేవంత్ నిన్ను వదిలిపెట్టను..కోర్టుకు లాగుతా : రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్