KTR : రేవంత్‌ నిన్ను వదిలిపెట్టను..కోర్టుకు లాగుతా : రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్‌

ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని  కేటీఆర్‌ అన్నారు. ఆధారాలున్నాయా? దమ్ముంటే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.

New Update
ktr vs revanth reddy

KTR vs Revanth Reddy

ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని  కేటీఆర్‌ అన్నారు.  

‘‘నాపై ఏదైనా డ్రగ్స్‌ కేసు నమోదైందా?దానితో నాకు సంబంధమున్నట్లు ఆధారాలున్నాయా?దమ్ముంటే బయటపెట్టాలని సీఎంను సవాల్‌ చేస్తున్నా. నేరుగా నా ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సీఎంకు కొత్తకాదు. రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.ఇక ఈ అంశాన్ని వదిలిపెట్టను.. తప్పకుండా రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతా అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.  

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

ఇది కూడా చదవండి:కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి

CM Revanth Reddy vs KTR

కాగా, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోంది. విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్‌ అవుతారు. కేటీఆర్‌ డ్రగ్స్‌ కేసులోనూ విచారణ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారు అని చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. నిరూపించాలని సవాల్ చేస్తూ ట్వీట్ పెట్టారు.
కేటీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. బనకచర్లపై సీఎం అడ్డంగా దొరికారని.. చిట్‌చాట్‌ పేరుతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని ఆరోపించారు. బనకచర్లపై తాను చేసిన సవాల్‌ను సీఎం రేవంత్‌ స్వీకరించలేదన్నారు. ఈ అంశంలో ఏపీకి వత్తాసు పలకడాన్ని హరీశ్‌తప్పుపట్టారు.

Also read :  Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!

Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!

drugs-case-hyderabad | drugs-case | ktr-chit-chat | chit-chat-with-media | chit-chat | dellhi | cm-revanthreddy | ktr vs cm revanthreddy | cm-revanth-reddy

Advertisment
Advertisment
తాజా కథనాలు