Suryapet crime : సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా ప్రమోద్, హరీష్‌ అనే యువకులు పరిచయమయ్యారు.

New Update
 Suryapet crime

Suryapet crime

 Suryapet crime : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. రోజా ద్వారా ప్రమోద్, హరీష్‌ అనే యువకులు పరిచయం అయ్యారు.నలుగురూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. ఇద్దరు యువకులూ మంచి వాళ్లుగా నటించడంతో సదరు యువతి మోసపోయింది. ఓ రోజు పార్టీ చేసుకుందామని చెప్పిన యువతి, యువకులు.. బాధితురాలిని హుజూర్ నగర్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపానికి తీసుకెళ్లారు. స్నేహం ముసుగులో బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు.స్నేహంగా నటిస్తూ ఆమెకు మద్యం తాగించి మరీ దారుణానికి ఒడికట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారు.  

Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ

Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!


ఆపై మత్తులో ఉన్న సదరు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీశారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. అయితే ప్రైవేటు వీడియోలు తీసిన కామాంధులు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. రాకపోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టారు. అయినా వారు అడిగింది చేసేందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఇద్దరూ కలిసి ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం మెుత్తం వివరించింది. దీంతో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువతిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు