అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం

ఓ విదేశీ మహిళపై గైడ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తిరువణ్ణామలైలో జరిగింది. ఫ్రాన్స్ దేశస్థురాలు ధ్యానం కోసం గైడ్ సాయంతో కొండపైకి వెళ్లింది. ఈ క్రమంలో గైడ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
crime

crime Photograph: (crime)

అరుణాచలం (తిరువణ్ణామలై)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ విదేశీ మహిళపై గైడ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ ఫ్రాన్స్ మహిళ తిరువణ్ణామలై కొండపై ధ్యానానికి వెళ్లింది. గిరి ప్రదక్షిణ చేసి ఆలయం వెనుక ఉన్న కొండపైకి వెళ్లి ధ్యానం చేసి వస్తుంటారు. ఈ క్రమంలో ఆమె గైడ్ సాయంతో ధ్యానం చేయడానికి వెళ్లగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చికిత్స కోసం ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

ఇటీవల ఏపీలో కూడా ఓ బాలికను బంధించి..

ఇదిలా ఉండగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది. కొంతమంది యువకులు కలిసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు.

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

మూడు రోజుల తర్వాత మైనర్ బాలికను విడిచిపెట్టేసిన నిందితులు..తనను ఆటో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సహాయంతో బాలిక విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాత్యాన్ని చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్కూరు పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు