IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ

గత ఏడాది ఐపీఎల్ లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పిచ్చ కొట్టుడుకొట్టారు. అయితే ఈసారి బ్యాటర్లు అంతకంటే ఎక్కువే బాదుతారు అని అంటున్నారు. 300 మైలు రాయిని దాటేస్తారని చెబుతున్నారు. 

New Update
ipl 2025

ఈసారి ఐపీఎల్ లో బ్యాటర్లతో హవా అని అంటున్నారు. ప్రతీ మ్ లో స్ట్రాంగ్ బ్యార్లు ఉండటంతో పాటూ ఆల్ రౌండర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో చివర వరకు రన్స్ తీసే అవకాశం ఉంది.   గతేడాది ఐపీఎల్ లో బెంగళూరు మీదే హైదరాబాద్‌ 287/3 స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతే కాక ముంబయిపై 277/3, ఢిల్లీపై 266/7 స్కోర్లు సాధించింది. అంతకు ముందు హైయ్యెస్ట్ స్కోరు బెంగళూరు 263 చేసింది. అది కూడా పన్నెండేళ్ల క్రితం. కానీ లాసట్ ఇయర్ ఈ రికార్డ్ చెరిగిపోయింది. అయితే ఈ ఏడాది లాస్ట్ ఇయర్ రికార్డ్ లను కూడా బ్యాటర్లు దాటేస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సారి ఐపీఎల్ లో 300 స్కోర్ నమోదవడం గ్యారంటీ అని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలు చెలరేగడం ఖాయం అని చెబుతున్నారు. 

300 స్కోర్ ఖాయం..

ఇంతకు ముందు కన్నా టీ20ల్లో పరుగుల వేగం పుంజుకుంది. బ్యాటర్లు దూకుడూ పెరిగింది. దాంతో పాటూ ఎప్పటిలానే భారత్ లో పిచ్ లన్నీ  బ్యాటర్లకే అనుకూలంగా ఉంటాయి. అదీ కాక ఆటగాళ్ళు అందరూ వరుస టోర్నమెంట్లు ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్నారు. అందరికంటే హైదరాబాద్ మీద అంచనాలు అధికంగా ఉన్నాయి. దాంతో పాటూ ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా జట్లు సెతౖం బ్యాటింగ్‌లో ఎంతో బలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు  మ్యాచ్ లో మొదటి జట్టు ఎంత స్కోరు చేసినా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు.  ఐపీఎల్‌లో రెండొందలో, రెండొందల యాభయ్యో చేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఛేదన సాధ్యమే అనుకునే రోజులివి. కాబట్టి స్కోర్లు ఇంకా ఇంకా పెరిగే సంకేతాలే కనిపిస్తున్నాయి. లక్నో, చెన్నై కాకుండా మిగతా గ్రౌండ్స్ అన్నీ బ్యాటింగ్‌కు అనుకూలమే. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబయి స్టేడియాల్లో అయితే పరుగుల వరద ఖాయం. 

 

Also Read: Mega Star: చిరంజీవికి లైఫ్ ఎచీవ్ మెంట్..యూకే పార్లమెంట్లో ఘన సత్కారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు