Bigg Boss Promo: రెచ్చిపోయిన రీతూ.. డెమోన్ పవన్ గప్ చుప్! నామినేషన్స్ లో రచ్చ రచ్చ!

బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ ఫైర్ మొదలైంది. తాజాగా విడుదలైన నామినేషన్ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం ఎవరు నామినేషన్స్ ఉండాలని నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రామ్ చేతుల్లో ఉందని తెలిపాడు.

New Update

Bigg Boss Promo: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ ఫైర్ మొదలైంది. తాజాగా విడుదలైన నామినేషన్ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం ఎవరు నామినేషన్స్ ఉండాలని నిర్ణయించే శక్తి ఫైర్ స్ట్రామ్ చేతుల్లో ఉందని తెలిపాడు. ఇందుకు కోసం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కులో  ''ఏ వైల్డ్ కార్డ్ చేతిలో బజార్ మోగే వరకు బాల్ ఉంటుందో.. అతడు ఒక ఎక్స్ కంటెస్టెంట్ ని ఎంపిక చేసుకొని ఆ బాల్ ను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా బాల్ తీసుకున్న కంటెస్టెంట్.. ఎక్స్ కంటెస్టెంట్స్ గ్రూప్ లోని ఇద్దరు సభ్యులను  నామినేట్ చేయాల్సి ఉంటుంది. 

రెచ్చిపోయిన రీతూ.. 

ఫస్ట్ రౌండ్ లో నిఖిల్ నాయర్ బాల్ సొంతం చేసుకొని.. తనూజ చేతికి ఇచ్చాడు. దీంతో తనూజ సుమన్ శెట్టి , రాము రాథోడ్ ని నామినేట్ చేసింది. ఇక్కడ తనూజ, సుమన్, రాము మధ్య చిన్న వాగ్వాదం కూడా జరిగింది.  ఆ తర్వాత రౌండ్ రమ్య మోక్ష చివరి వరకు బాల్ పట్టుకొని.. రాము రాథోడ్ కి అందించింది. బాల్ తీసుకున్న రాము డెమోన్ పవన్, రీతూని నామినేట్ చేశాడు.  గత వారం జరిగిన బెలూన్ టాస్క్ లో రీతూ ఆడిన ఫౌల్ గేమ్ పాయింట్ రాము రీతూని నామినేట్ చేశాడు. డెమోన్ పవన్ ని కూడా అదే పాయింట్ చేసి నామినేషన్ లో వేశాడు. ఇక్కడే నామినేషన్ రచ్చ మొదలైంది. ''మరి మేం ఫౌల్ గేమ్ ఆడుతుంటే సంచాలక్ గా నువ్వేం చేశావ్.. నిద్రపోయావా? నువ్వు అప్పుడే ఖండిచాల్సింది? అప్పుడు ఏం మాట్లాడకుండా.. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? అంటూ రాము పై  రెచ్చిపోయింది రీతూ. మరోవైపు డెమోన్ పవన్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కనిపించాడు ప్రోమోలో.  

Also Read:  Telusu Kada Trailer: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

Advertisment
తాజా కథనాలు