Murder in Bank Lift: హైదరాబాద్ లో దారుణం...బ్యాంక్ లిప్టులో మర్డర్

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. దోమలగూడ పీఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు.

New Update
Hyderabad Murder

Hyderabad Murder

Murder in Bank Lift: హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది.దోమలగూడ పీఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బంది లిఫ్ట్ లో మృతదేహం కనిపించడంతో భయాందోళనలకు లోనయ్యారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దోమలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

 

 

Also Read:  Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్‌‌అండ్‌‌టీ

డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్యకు పాత కక్షలే కారణం కావొచ్చని భావిస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి.. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని ఎక్కడ హత్య చేశారు, ఎలా లిఫ్ట్‌లోకి తీసుకొచ్చారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు.మృతుడికి సంబంధించిన వివరాలు, హంతకుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.బ్యాంకు సిబ్బందిని , స్థానికులను కూడా విచారించి సమాచారం సేకరిస్తున్నారు.పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: Pak-India: పాక్‌కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!

కాగా ఎప్పుడు రద్దీగా ఉండే హిమాయత్ నగర్ వంటి ప్రాంతంలో హత్య జరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో బ్యాంకులో ఎవరు ఉన్నారు..? బయటి వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు అత్యంత కీలకంగా తీసుకుని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడి వివరాలు తెలిస్తే కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు