Tagore movie : అమీర్‌పేట్‌ వెల్‌నెస్‌ హాస్పిటల్‌లో దారుణం..అచ్చం ఠాగూర్‌ చిత్రంలా శవానికి ట్రీట్‌మెంట్‌?

కార్పోరేట్‌ హాస్పిటల్‌ పేరుతో పలు ఆసుపత్రులు పేషంట్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ఠాగూర్‌ చిత్రంలో మాదిరిగా చనిపోయిన శవానికి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నామని నమ్మించి లక్షల్లో వసూలు చేస్తున్నాయి. చనిపోయిన శవాన్ని ఇవ్వాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి.

New Update
Treatment for a dead body..demand for money

Treatment for a dead body..demand for money

Tagore movie :  కార్పోరేట్‌ హాస్పిటల్‌ పేరుతో పలు ఆసుపత్రులు పేషంట్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. చిన్నచిన్న వ్యాధులకే లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిండ ముంచుతున్నారు.అవసరమైతే ఠాగూర్‌ చిత్రంలో మాదిరిగా చనిపోయిన శవానికి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నామని నమ్మించి లక్షల్లో వసూలు చేస్తున్నారు. తీరా మా ప్రయత్నం మేము చేశాం కానీ పేషేంట్ ను బతికించలేకపోయాం అంటూ చేతులెత్తేస్తున్నారు. అలాంటి ఘటనే అమీర్‌ పేటలో చోటు చేసుకుంది. అమీర్‌పేటలోని వెల్‌నెస్‌ అసుపత్రి నిర్వహకులు శవంతో భేరాసారాలు మొదలు పెట్టారు. చనిపోయిన శవాన్ని ఇవ్వాలంటే రూ.60 వేలు కట్టాలని బెదిరింపులకు దిగారు. దీంతో హాస్పిటల్‌ ఆవరణలో బాధితులు ఆందోళనకు దిగారు.

ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

బాధితుల కథనం ప్రకారం..పుష్పలత అనే మహిళ లంగ్‌ ఇన్ఫెక్షన్  సమస్యతో అమీర్‌పేటలోని వెల్‌నెస్ హాస్పిటల్‌లో చేరింది.హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక ఆమెకు కిడ్నీ ఫెయిల్ అయిందని ఒకసారి,  లివర్ డ్యామేజ్ అయిందని మరొకసారి చెప్పి వైద్యానికి ఖర్చుల పేరుతో హాస్పిటల్‌ యాజమాన్యం డబ్బులు గుంజింది. ఆ తర్వాత అంత సెట్‌ అయిందని చెప్పి నమ్మించారు. మరుసాటి రోజే వెంటిలెటర్ మీదకు పుష్పలతను షిఫ్ట్‌ చేశారు. ఈ రోజు ఉదయం కూడా రూ.40 వేలు కట్టించుకుని ఆ తర్వాత పేషంట్‌ చనిపోయారని డాక్టర్లు సమాధానం ఇచ్చారు. నాలుగురోజుల్లో రూ.3లక్షల కట్టించుకుని చనిపోయిన శవానికే ట్రీట్‌ మెంట్‌ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా ఇంకా రూ.60 వేలు ఇస్తేనే డెడ్‌బాడీని ఇస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్న డబ్బులు ఖర్చు చేశాం..బాడీ అప్పగించాలని కోరిన హాస్పిటల్ యాజమాన్యం కనికరించక పోవడంతో బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?

కాగా అమీర్‌ పేట వెల్‌ నెస్‌ హాస్పిటల్‌కు ఈ వ్యవహారం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ఇలాగే చనిపోయిన వారికి చికిత్స చేస్తు్న్నట్లు నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్షలు ఇచ్చి శవాన్ని తీసుకెళ్లాలని కోరుతూ పేషంట్‌ సంబంధికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలుఉన్నాయి.  గత ఏడాది కూడా ఆనారోగ్య సమస్యలతో రాజయ్య అనే వృద్దుడు ఇదే హాస్పిటల్‌లో చేరాడు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. అయితే యాజమాన్యం తప్పు ఒప్పుకోకపోగా మిగతా డబ్బులు ఇస్తేనే డెడ్‌బాడీని ఇస్తామని చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే రూ.3 లక్షలు చెల్లించిన బాధితులకు మరో రూ.8 లక్షలు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని ఖరాఖండిగా చెప్పారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారగా మరోసారి అలాంటి సంఘటనకే హాస్పిటల్‌ యాజమాన్యం పాల్పడింది. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

Advertisment
తాజా కథనాలు