Tarnaka Junction : మీరు తార్నాక ఏరియాలో ఉంటారా? అయితే.. ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..!

గత కొన్ని రోజులుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. తార్నాక జంక్షన్‎ను రీ ఓపెన్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు.

New Update
Tarnaka Junction

Tarnaka Junction

Tarnaka Junction : గత కొన్ని రోజులుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. తార్నాక జంక్షన్‎ను రీ ఓపెన్ చేసేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహనాలు నేరుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపటి (ఏప్రిల్ 18) నుంచి మే 2  వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు పోలీసులు.మొత్తం 15 రోజుల ట్రయల్ రన్ అనంతరం.. శాశ్వతంగా ఆ జంక్షన్‎ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Also Read :  బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్

జంక్షన్ ఓపెన్ అయితే యూటర్న్ అవసరం ఉండదు. దీంతో పాటు వాహనదారులకు ప్రయాణ భారం కూడా తగ్గుతోంది. జంక్షన్ పునరుద్ధరణ జరిగితే ప్రయాణికుల ఎనిమిది ఏళ్ల ట్రాఫిక్ సమస్యకు ఇక చెక్ పడనుంది. గతంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జంక్షన్ ను మూసివేసింది. జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్ అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ను నివారించాలని, వాహనాల రాకపోకలు సులువుగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసుల అవసరముండదని అటు రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూ-టర్న్ లను ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైంది.

Also Read: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి

ఇటీవల ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ లో పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్ ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేసింది. దీంతో తార్నాక జంక్షన్ ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. సెంటర్ లో ఐలాండ్ఏర్పాటుతో పాటు ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్ పాత్ లను మూడు మీటర్లకు కుదించనున్నారు. దీంతో పాటు జంక్షన్ కు సమీపంలో రెండు వైపులా ఉన్న బస్ స్టాప్ లను తరలిస్తారు. తార్నాక జంక్షన్ తెరిచాక నగరంలోని మిగతా చోట్ల ఉన్న యూ-టర్న్ ల సంఖ్య కూడా తగ్గించే ప్రయత్నం చేయనున్నారు.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

రోజూ ఉదయం, సాయంత్రం పీక్​అవర్స్‎లో రెండు వైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. గతంలో ఒకరిద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్​ఉన్నచోట నలుగురు కానిస్టేబుల్స్‎ను డ్యూటీ చేయాల్సి వస్తోంది. పైగా యూ-టర్న్ ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ట్రాఫిక్​ సిగ్నల్​ సిస్టమ్స్ పై పనిచేసే అర్కడేస్ కంపెనీతోపాటు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక కమిటీ వేసింది. స్టడీ చేసి జంక్షన్‎ను తిరిగి ప్రారంభించాలని సిఫారసు చేసింది. జంక్షన్‎కు సెంటర్‎లో ఐలాండ్​ ఏర్పాటుతో పాటు ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్​ పాత్ లను మూడు మీటర్లకు కుదించనున్నారు. దీంతో పాటు జంక్షన్‎కు సమీపంలో రెండు వైపులా ఉన్న బస్టాప్ లను అక్కడి నుంచి తరలిస్తారు. ఇదంతా వారం, పదిహేను రోజుల్లో పూర్తిచేసి జంక్షన్ నుంచి వాహనాల రాకపోకలు సాగించనున్నారు. 

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు