NTR-Neel Update: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ 22న ప్రారంభమవుతుంది. మే 15 వరకు కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరగనుంది. రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో రిలీజ్ కానుందని సమాచారం.

New Update
NTR Neel

NTR-Neel Update

NTR-Neel Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లో జాయిన్ కానున్నారు. దాదాపు మూడు వారాలపాటు బ్రేక్ లేకుండా జరిగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

Also Read:వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

ఈ షెడ్యూల్ మే 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో షూట్ చేయబోయే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. ఈ సన్నివేశం కథలో చాలా కీలకంగా కాబోతుందట. ఇప్పటికే తన పాత్ర అవసరాల మేరకు ఎన్టీఆర్ తన బరువును కూడా తగ్గించుకున్నారు. 

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

హీరోయిన్‌గా రుక్మిణి వసంత

ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హీరోయిన్‌గా రుక్మిణి వసంత నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో పని చేసిన టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగుతుండగా, మేజర్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి విడుదల కానుందని ముందుగా ప్రకటించినప్పటికీ. తాజా సమాచారం ప్రకారం రిలీజ్ వేసవి సీజన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా 2025 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు