Harish Rao:
కాళేశ్వరం ప్రాజెక్టుపై( Kaleshwaram Barrage) ఈ రోజు హరీశ్‌రావు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుందని మండిపడ్డారు.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోందని ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 62 వేల క్యూసెక్కుల వరదను వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు.. వారం రోజుల కిందట ఇదే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాను.. మోటర్లు ఆన్ చేయమంటే పట్టించుకోలేదన్నారు.
కాళేశ్వరం పై ప్రభుత్వం ఇంకొక కుట్ర చేస్తోంది.. మోటర్లను కావాలని ఆన్, ఆఫ్ చేస్తున్నారు.. రోజు ఇలా చేస్తే మోటర్లు పాడవుతాయని BHEL హెచ్చరించిందన్నారు.. అయినా కావాలనే వారు కుట్రలు చేస్తున్నారు.. ఉత్తమ్, సీఎం మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కానీ మోటర్లు ఆన్ చేయకపోతే వేలాది మంది రైతులతో వెళ్లి మోటర్లు ఆన్ చేస్తాం.. నల్గొండలో మాధవరెడ్డి ప్రాజెక్టుపై కూడా ఇలానే చేస్తున్నారు.. 18 ఏళ్ల తర్వాత కృష్ణా నదిలో నీళ్లు వచ్చాయి.. అయినా ఇప్పటివరకు ఏ ఒక్క చెరువు కూడా నింపలేదు.. కల్వకుర్తి ప్రాజెక్టులో మూడు మోటర్లతో పంపింగ్ చేయాల్సి ఉంటే ఒకటే మోటార్ ఆన్ చేశారు.. వరంగల్ జిల్లాలో దేవాదుల విషయంలోనూ ఇలానే చేస్తున్నారు.. కమీషన్లు, పర్సెంటేజీలకు మాత్రమే మీకు సమయం సరిపోతుందా అని మండిపడ్డారు.
Also Read: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా
ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ కి నీళ్ల విలువ తెలియదని హరీశ్‌రావు అన్నారు.. మీరు వ్యవసాయం చేయలేదు కాబట్టి మీకు నీటి విలువ తెలియదు.. నేరపూరిత నిర్లక్ష్యం వల్ల వర్షాలు వస్తున్నా చెరువులు, డ్యామ్ లు నింపటం లేదు.. BRS పార్టీ, కేసీఆర్, హరీష్ రావుపై ఉన్న కోపం రైతులపై చూపించవద్దని ఆయన సూచించారు.. మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని కిందికి వదలొద్దు.. కాళేశ్వరం ప్రాజెక్టు పై BRS పై నిందలు మోపడనికే ఇలా చేస్తుంది అని ఆయన మండిపడ్డారు.. కాళేశ్వరం కూలింది అన్న విషయాన్ని నమ్మించడానికి ఇలా చేస్తున్నారు.. మళ్ళీ కాళేశ్వరం నుంచి నీరు పంపింగ్ చేస్తే కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం బయటపడుతుందని దుర్మార్గం చేస్తుంది.. ప్రభుత్వం నడపడం మీకు చేతకావడం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మిడ్ మానేరులో ఇంకా 20 టీఎంసీల నీరు నిండాల్సి ఉంది. దీన్ని నింపితే యాసంగిలో రైతులకు మేలు కలుగుతుంది. ఎల్లంపల్లి నుంచి వెంటనే రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లిలో 7 మోటార్లు ఉంటే రెండింటిని మాత్రమే నడుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుంటే మేం వెళ్లి ఆన్ చేస్తాం. దురుద్దేశంతో మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయడంలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూలిపోవాలని కుట్ర చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు విమర్శించారు. . నీళ్లను సముద్రం పాలు చేస్తామంటే మేము చూస్తూ ఉరుకోము.. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
Also Read : RS Praveen Kumar: కేసీఆర్ ఓటమి కోసమే మేడిగడ్డను బాంబులతో పేల్చారు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ
Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం మరో కుట్ర.. మోటర్లను ఆన్, ఆఫ్ చేస్తున్నారు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ రోజు హరీశ్‌రావు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుందని మండిపడ్డారు..
Harish Rao