/rtv/media/media_files/2025/11/02/naveen-yadav-2025-11-02-17-38-48.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubilee hills by election) దగ్గర పడుతున్నా కొద్దీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. బీఆర్ఎస్(brs), కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(naveen yadav)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ(borabanda) పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేశారు. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్‌పైనా కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read : పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన ప్రియుడు.. ఇంటిముందు ప్రియురాలి ధర్నా
Police Case On Naveen Yadav
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు నమోదు
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025
బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో నవీన్ యాదవ్‌పై కేసు నమోదు
నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్‌పై కూడా కేసు నమోదు
ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పీఎస్‌లో వీరిపై 3… https://t.co/g3uFpM66LKpic.twitter.com/NfxKAWDXaR
గతంలో కూడా నవీన్ యాదవ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తూ ఓటరు ID కార్డులను పంపిణీ చేశారనే ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు మాధురానగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్నికల చట్టాల ఉల్లంఘనతో పాటు, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ రెండు కేసులూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంతోనే నమోదయ్యాయి. ఈ బై ఎలక్షన్ పోలింగ్ నవంబర్ 11న జరిగి.. ఫలితాలు 14న వెలవడనున్నాయి.
Also Read : తెలుగు యూట్యూబర్‌కు బంపరాఫర్ ఇచ్చిన UAE
Follow Us