Baloch Liberation Army: పాక్‌ ఆర్మీపై విరుచుకుపడుతున్న బలోచ్ లిబరేషన్.. స్పాట్‌లోనే 29 మంది!

బలోచ్ లిబరేషన్ మరోసారి పాక్‌ ఆర్మీ బస్సుపై దాడి చేయగా 29 మంది సైనికులు మృతి చెందినట్లు తెలిపింది. 48 మంది పాక్‌ సైనికులతో వెళ్తున్న ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో బలోచ్ లిబరేషన్ దాడి చేసింది. 29 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Baloch Liberation Army

Baloch Liberation Army

పాకిస్తాన్ ఆర్మీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ మరోసారి పాక్‌ ఆర్మీ బస్సుపై దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 29 మంది సైనికులు మృతి చెందినట్లు బలోచ్ లిబరేషన్ తెలిపింది. క్వెట్టా, కలాట్, జహు ప్రాంతాల్లో దాడి చేసినట్లు స్వయంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. 48 మంది పాక్‌ సైనికులతో వెళ్తున్న ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో బలోచ్ లిబరేషన్ దాడి చేయడంతో స్పాట్‌లో 29 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో సైనికులు గాయపడ్డారు.

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

దాదాపుగా 700 మంది..

గత ఆరు నెలల్లో బలోచ్ లిబరేషన్ మొత్తం 286 దాడులు నిర్వహించింది. ఇందులో దాదాపుగా 700 మంది మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యంపై దాడులు చేస్తామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

baloch liberation army | baloch liberation army attack | baloch liberation army latest news

Advertisment
Advertisment
తాజా కథనాలు