/rtv/media/media_files/2025/09/08/an-auto-driver-returns-lost-gold-and-money-to-their-owners-in-nirmal-2025-09-08-07-22-08.jpg)
An auto driver returns lost gold and money to their owners in Nirmal
సాధారణంగా రోడ్డుపై నోట్లు, ఏవైనా ఆభరణాలు, మొబైల్ ఫోన్లు లాంటివి కనిపిస్తే చాలామంది వాటిని జేబులో వేసుకొని వెళ్లిపోతుంటారు. అతికొద్ది మంది మాత్రమే వాటిని పోలీస్ స్టేషన్‌లో లేదా పోగొట్టుకున్న బాధితులకు అప్పగిస్తుంటారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా తన నిజాయతీని చాటుకున్నాడు. నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన డ్యాకుమెంట్స్ ఉన్న సంచిని పోగొట్టున్న మహిళకు అప్పగించారు.
Also Read: అయ్యో.. ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మైనర్లు మృతి
ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కడెం ప్రాంతంలో సుజాత అనే మహిళ ఉంటోంది. ఈమె నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నారు. శనివారం ఆమె కొడుకుతో కలిసి బైక్‌పై నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు వెళ్తున్నారు. అయితే తన కూతురు పెళ్లి కోసం దాచిన 16 బంగారు ఆభరణాలు, కొంత నగదు, కొన్ని డాక్యుమెంట్స్‌తో కూడిన బ్యాగ్‌ను ఆ బైక్‌కి తగిలించారు. కొండాపూర్ దగ్గర్లోని బైపాస్ దగ్గరికా రాగానే ఆ బ్యాగ్ పడిపోయింది. దాన్ని వాళ్లు గమనించకుండానే వెళ్లిపోయారు.
Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
అదే సమయంలో సాయికుమార్ అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తున్నారు. ఆ ఆటోలో ఉన్న సౌజన్య అనే ప్రయాణికురాలు రోడ్డుపై పడి ఉన్న బ్యాగును గమనించి డ్రైవర్‌కు చెప్పారు. దీంతో ఆటోడ్రైవర్ సాయికుమార్ ఆ బ్యాగును తీసుకొని ఇంటికి వెళ్లారు. అయితే బంగారంతో ఉన్న బ్యాగు పోయిందనే మెసేజ్ సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇది చూసిన సౌజన్య తన భర్త ద్వారా ఆటో డ్రైవర్ సాయికుమార్‌కు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో అతడు బాధితులకు ఆదివారం సమాచారం అందించడంతో వాళ్లు అతడి ఇంటికి వచ్చారు. బంగారం, డబ్బులు, డాక్యుమెంట్స్‌ను బాధితురాలు సుజాతకు అప్పగించారు. తన నిజాయతీని చాటుకున్న ఆటోడ్రైవర్‌ను అక్కడి స్థానికులు ప్రశంసించారు. అంతేకాదు సన్మానం చేసి మరి అభినందనలు తెలియజేశారు.
Also Read: దేశంలోని ఆలయాలన్నీ క్లోజ్..కానీ ఆ రెండు మాత్రం ఓపెన్..ఎందుకో తెలుసా?