Lunar Eclipse : దేశంలోని ఆలయాలన్నీ క్లోజ్‌..కానీ ఆ రెండు మాత్రం ఓపెన్‌..ఎందుకో తెలుసా?

ఈ రోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ బ్లడ్ మూన్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముసేసినా.. ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కల్కాజీ మందిర్ ఆలయం తెరిచే ఉంటాయి.

New Update
Kalkaji Mandir

Srikalahasti , Kalkaji Mandir

Lunar Eclipse : సెప్టెంబర్ 7న అంటే ఆదివారం అంటే ఈ రోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సుమారు 82 నిమిషాల పాటు ఈ బ్లడ్ మూన్  కొనసాగనుంది. ఈ బ్లడ్ మూన్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ దాదాపు మూతపడ్డాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలతో కూడిన ఉత్తరాదిలో కూడా టెంపుల్స్ దాదాపు అన్ని క్లోజ్ అయ్యాయి.  వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్నీ మధ్యాహ్నామే  అర్చకులు మూసేశారు.  జమ్మూ కాశ్మీర్ లో వైష్ణో దేవీ టెంపుల్ కూడా మూతపడింది. ఉత్తరాఖండ్‎లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలు, అయోధ్యలో రామాలయం, మథురలో శ్రీ కృష్ణుడి దేవాలయం మూతపడింది. అలాగే తమిళనాడులోని బృహదీశ్వరాలయం, అరుణాచలం.. ఆంధ్రప్రదేశ్‎లోని తిరుమల వంటి ప్రముఖ టెంపుల్స్ చంద్ర గ్రహణ ప్రభావంతో మూసివేశారు. ఇక తెలంగాణలోనూ యాదగిరిగుట్ట దేవాలయం, వేములవాడ దేవాలయం, భద్రాచలం తదితర దేవాలయాలు మూత పడ్డాయి.

ఈ రోజు రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం  తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడనుంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం (సెప్టెంబర్ 8) సంప్రోక్షణ అనంతరం తిరిగి దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకుంటాయి.

ఈ రెండు ఆలయాలు ప్రత్యేకం..


 ఆదివారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. సోమవారం ఉదయం ఆలయాలు తిరిగి తెరుచుకుంటాయి. అయితే.. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముసేసినా.. ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించక పోయినప్పటికీ  ఆలయంలో శాంతిపూజలు మాత్రం నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు..మరో ఆలయం అది కూడా ఢిల్లీలో ఉన్న మరో ఆలయం కూడా  తెరిచే ఉంటుంది.

 అది  ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ కల్కాజీ మందిర్ ఆలయం. ఈ టెంపుల్‌ కూడా గ్రహణం సమయంలో తెరిచే ఉంటుంది. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయం గ్రహగండాలకు అతీతంగా నిలుస్తోంది. ఢిల్లీలోని అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఇక్కడ కాళీమాత గ్రహణం సమయంలో కూడా నిరంతరాయంగా దర్శనమిస్తుంది. ఢిల్లీలోని నెహ్రు ప్లేస్ ఎదురుగా కల్కాజీ మందిర్  ఉంటుంది. ఈ ఆలయంలో గ్రహణం సమయంలో కూడా పూజలు అందుకుంటుంది కాళీమాత.

సాధారణ రోజుల్లో కల్కాజీ మందిర్ ఉదయం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 11:30 గంటల వరకు తెరిచి ఉంటుంది, ఆచార కార్యక్రమాల కోసం మధ్యాహ్నం కొద్దిసేపు విరామం ఇస్తారు. గ్రహణాలు ఏర్పడినపుడు , ఇతర దేవాలయాల మాదిరిగా మూసివేయకుండా, దర్శనం యథావిధిగా ఉంటుంది. తొమ్మిది గ్రహాలు, పన్నెండు రాశిచక్ర గుర్తులు ఆలయంలో దైవిక అస్తిత్వాలుగా నివసిస్తాయి, వీటిని ప్రతీకాత్మకంగా కాళీమాత పిల్లలుగా భావిస్తారు భక్తులు. గర్భగుడిలో వాటి ఉనికి ఆలయాన్ని గ్రహణ ప్రభావానికి గురికాకుండా నిలువరిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. గ్రహణాలకు సంబంధించిన చెడు శక్తిపైన కాళీమాత శక్తి ప్రబలంగా పనిచేస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయం తెరిచే ఉంటుంది.

Also Read : SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్

Advertisment
తాజా కథనాలు