/rtv/media/media_files/2025/09/08/chamarajanagar-road-accident-three-children-killed-2025-09-08-06-39-28.jpg)
Chamarajanagar Road Accident Three children killed
రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది తమ వాహనాలను స్పీడ్‌గా నడిపి అదుపు చేయలేక.. తమతో పాటు ఇతర అమాయకుల్ని బలి తీసుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వాలు, పోలీసు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గుముఖం పట్టడం లేదు.
Chamarajanagar Road Accident
తాజాగా అలాంటిదే మరొక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు మోపెడ్ (చిన్న ద్విచక్ర వాహనం) పై వెళ్తుండగా ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జరిగింది. ఈ ప్రమాదంపై చామరాజనగర్ పోలీసు సూపరింటెండెంట్ బిటి కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహ్రాన్ (13), రెహాన్ (8), ఫైసల్ (11), అద్నాన్ పాషా (9) మైనర్లు స్కూల్ ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న మోపెడ్ (చిన్న ద్విచక్ర వాహనం)పై చామరాజనగర్‌లోని గాలిపుర లేఅవుట్ నుంచి తమ ఇంటికి బయలుదేరారు.
అదే సమయంలో జాతీయ రహదారి 948 బై-పాస్ రోడ్డులో.. తలవాడి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఆపై కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అనంతరం మైనర్లు ప్రయాణించిన మోపెడ్ లారీ చక్రాల కింద పడటంతో.. ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అదే సమయంలో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చామరాజనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చామరాజనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CIMS) కు తరలించారు. CIMS లో ప్రాథమిక చికిత్స తర్వాత.. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 8 ఏళ్ల రెహాన్, 11 ఏళ్ల ఫైసల్ మరణించారు. 9 ఏళ్ల అద్నాన్ పాషా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.