/rtv/media/media_files/4Y1zb8cUV5q2Ps75MRkC.jpg)
ఇక మీదట నుంచి 100 శాతం ఇంజనీరింగ్ సీట్లు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారికే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు మరిన్ని సీట్లు వస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ముగియడంతో తాజాగా దీనికి సంబంధించి కొత్త జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులే ఇంజనీరింగ్ సీట్లు పొందే అవకాశం ఏర్పడింది.
ఇకపై అన్ని సీట్లూ మనకే...
ప్రభుత్వం కొత్త జీవో ప్రకారం విద్యాసంస్థల్లో 15శాతం కోటా సీట్లన్నీ ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్లలో 85 శాతం తెలంగాణ వారికి, 15 శాతం తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి రానున్నాయి. ఏపీ విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉండదు. ఇంజనీరింగ్, టెక్నాలజీ. ఫార్మసీ, ఆర్కిటెక్చర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా తదితర కోర్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
/rtv/media/media_files/2025/02/28/0WGNuyau5F9pvAKCl0LU.jpeg)
Also Read: USA: ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుపై రచ్చ..ట్రంప్ ఆదేశాలను నిలిపేయాలన్న కోర్టు