TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా...నష్టమా...ఎవరి వాటా ఎంత?
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.