/rtv/media/media_files/2025/08/08/spirit-casting-call-2025-08-08-16-18-36.jpg)
Spirit Casting Call
Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు సినిమా పేరు తప్పా.. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. సెప్టెంబరు నెలాఖరున పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.
విదేశాల్లో తొలి షెడ్యూల్..
అయితే తాజా అప్డేట్ ప్రకారం..స్పిరిట్ తొలి షెడ్యూల్ షూటింగ్ విదేశాల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో లొకేషన్లు చూసి వచ్చారు. తొలి షెడ్యూల్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం అయినప్పటికీ.. ప్రభాస్ మాత్రం నవంబర్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
భారీ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు డార్లింగ్ చేసిన సినిమాల్లో.. పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. దీంతో సినిమాలో ప్రభాస్ లుక్, క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఉన్న పలు AI ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంటెన్స్ ఎమోషన్స్, లవ్, హింసతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'స్పిరిట్' ఉండబోతుందని తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుందని అంటున్నారు.
Peltayi Anni pelyatyi 🤩😍#Spirit#sandeepreddyvangapic.twitter.com/B44qRdktSg
— Prabhas Fan (@Itsaprank132511) August 8, 2025
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన త్రిప్తి దిమ్రీ ఇందులో హీరోయిన్ గా మెరవనుంది. మొదట ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఆమె తప్పుకోవడంతో త్రిప్తిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి పై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు సంగీతం అందించిన హర్ష వర్ధన్ రామేశ్వర్.. ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పాటలను కంపోజ్ చేయడం కూడా పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని టాక్.
స్పిరిట్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఇందులో విలన్ పాత్ర కోసం కొరియన్ నటుడు మా డాంగ్-సియోక్ (డన్ లీ)ను తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్సమెంట్ రాలేదు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Coolie: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!