/rtv/media/media_files/2025/06/16/NW2qmAns5DsvgJORtg5A.jpg)
Bomb threat to Sriharikota
BIG BREAKING : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌కు ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు పోన్ చేసి బాంబులు పెట్టినట్లు బెదిరించారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెన్నైలోని సీఐఎస్‌ఎఫ్ కార్యాలయానికి పోన్ చేసి షార్‌లో బాంబు పెట్టినట్లు చెప్పి బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు షార్‌కు సమాచారం అందించారు.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త
ఈ క్రమంలో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. షార్‌లో అనువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. కాగా బాంబు బెదిరింపుపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్స్ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరి నుంచి వచ్చాయి.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా గతంలోనూ కొంతమంది ఆకతాయిలు ఇలా కాల్స్ చేసి బెదిరించినట్లు ఆరోపలున్న నేపథ్యంలో ఇది కూడా ఆకతాయిల పనేనని భావిస్తున్నారు.
Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?