Sexual harassment : జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ..మత్తుమందు ఇచ్చి ఏం చేశారంటే?

వైద్యవృత్తిని దైవంగా భావిస్తారు. అది డాక్టరైనా, ఆ వృత్తిలో ఉన్నవారైన అలాగే ఉండాలి. కానీ ఒక కంపోండర్ చేయరాని పనిచేశాడు. చికిత్సకోసం వచ్చిన పేషెంట్‌పై అత్యాచారం చేసి ఆ వృత్తికి కళంకం తెచ్చాడు. కరీంనగర్ జిల్లాలోఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

New Update
Compounder rapes patient in private hospital

Compounder rapes patient in private hospital

Sexual harassment : వైద్యవృత్తిని దైవంగా భావిస్తారు. అది డాక్టరైనా, ఆ వృత్తిలో ఉన్నవారైన అలాగే ఉండాలి. కానీ ఒక కంపోండర్ చేయరానిపనిచేశాడు. చికిత్సకోసం వచ్చిన పేషెంట్‌పై అత్యాచారం చేసి ఆ వృత్తికి కళంకం తెచ్చాడు. కరీంనగర్ జిల్లాలోఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు కంపోండర్. ఆదివారం  జిల్లా కేంద్రంలోని దీపికా ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. 

Also Read : ఎంపీ మిథున్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌..ఎందుకంటే?

వివరాల ప్రకారం..జగిత్యాలకు చెందిన ఒక యువతి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. అక్కడ పనిచేసే దీక్షిత్ అనే కాంపౌండర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు ఆసుపత్రి సీసీ ఫుటేజ్ సేకరించి.. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!


జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువతి అనారోగ్యంతో కరీంనగర్ నగరంలోని దీపిక ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స నిమిత్తం ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. అయితే  రాత్రి సమయంలో ఆ యువతి బెడ్‌ వద్ద ఎవరు లేకపోవడంతో ఆసుపత్రి కాంపౌండర్ దీక్షిత్ ఆమెకు మత్తుమందు ఇచ్చి.. ఘోర అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనను యువతి తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆగ్రహంతో ఆదివారం ఉదయం   పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేషెంట్ ను గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు.

Also Read: SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్

Advertisment
తాజా కథనాలు