Mithun Reddy Interim Bail: ఎంపీ మిథున్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌..ఎందుకంటే?

ఏపీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.మద్యం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ ఈ బెయిల్‌ మంజూరు చేసింది.

New Update
YSRCP MP Mithun reddy Arrested in Money laundering case

YSRCP MP Mithun reddy

Mithun Reddy Interim Bail : ఏపీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.మద్యం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ ఈ బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 11న సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు తిరిగి సరెండర్‌ కావాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు మిథున్‌ రెడ్డి. రూ.50 వేల పూచికత్తు, ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్‌మంజూరు చేసింది కోర్టు. కాగా ఏపీ లిక్కర్‌స్కాం కేసులో మిథున్‌ రెడ్డి ఏ4 నిందితునిగా ఉన్నారు.

ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!

కాగా, మిథున్‌ రెడ్డి మధ్యంతర, రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లపై ఈనెల3న విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. మధ్యంతర బెయిల్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఆరో తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు. రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. అదేవిధంగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఆరో తేదీన తీర్పును వెలుస్తామని కోర్టు వెల్లడించింది. ఈ మేరకు మిథున్‌ రెడ్డికి మధ్యంతర బెయిల్‌మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

Advertisment
తాజా కథనాలు