BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!

బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

New Update
BRS Silver Jubilee

BRS Silver Jubilee

BRS Silver Jubilee : బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

కాగా బీఆర్ఎస్ సభ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయా జిల్లాల నేతలతో సమావేశమై ఉత్సవాలపై దిశానిర్ధేశం చేశారు. లక్షమందికి మించకుండా సభ నిర్వహించాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారం కోల్పొయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఈ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 15 నెలల కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఫెయిల్‌ అయిందని చెప్తున్న బీఆర్ఎస్‌ పార్టీ అధికార కాంగ్రెస్‌ పార్టీ లోపాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సభను గతంలో కంటే భిన్నంగా నిర్వహించాలని భావిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించ ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్తులో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించి వాటిని ఏ విధంగా అమల్లో పెట్టాలనేది పార్టీ అధినేత దిశా నిర్ధేశం చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారికిగా కమిటీల నిర్మాణ, గ్రామీణ స్థాయికి పార్టీని తీసుకెళ్లడం చేయాలని భావిస్తోంది. అయితే వరంగల్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున సమావేశానికి అనుమతి వస్తుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. సభకు అనుమతి ఇవ్వాలని రెండు సార్లు పార్టీ నాయకులు జిల్లా పోలీస్‌ అధికారులను కలిసి కోరినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల్లో అనుమతిపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read :  సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

ఇక తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమంగానే ప్రజల్లోకి వెళ్లింది.ఆట,పాట, మాట అనే కాన్షెఫ్ట్‌తో ఉద్యమం సాగింది. బీఆర్‌ఎస్‌ కూడా మొదటి నుంచి సాంస్కృతిక రంగానికి పెద్ద వేస్తూ వచ్చింది. తెలంగాణ ధూంధాం పేరుతో రసమయి తదితరులు పార్టీకి సాంస్కృతిక సారధ్యం వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రసమయిని సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కూడా కేసీఆర్‌ నియమించారు.అలాగే ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారు. రసమయికి కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కేసీఆర్‌. కాగా బీఆర్‌ఎస్‌ 25 ఏండ్ల సభ సందర్భంగా రసమయి మరోసారి తన గళానికి పదును పెట్టారు. "గులాబీల జెండా పట్టి..మల్లేశో...గుండెకద్దుకోని రార మల్లేశో...ఓరుగల్లు మహాసభకు మల్లెశో..ఊరువాడ కదలిపోరా మల్లేశో' అంటూ మరసారి తన గళాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. కాగా పోలీసుల అనుమతి లభిస్తే బీఆర్‌ఎస్‌ సభ ఘనంగా జరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు