Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బిల్డింగ్‌ అంతటా వ్యాపించాయి. అపార్ట్‌మెంట్‌ పైనుంచి పిల్లలు, మహిళలు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

New Update
Women, Kids Jump From Balcony As Blaze Rages in Gujarat

Women, Kids Jump From Balcony As Blaze Rages in Gujarat

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బిల్డింగ్‌ అంతటా వ్యాపించాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు తమ గదుల నుంచి బయటకు వచ్చారు. మరికొందరు అక్కడే చిక్కుకున్నారు. కోక్రా ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో ఓ ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్ అయ్యింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.  సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

అయితే మంటలు అదుపు చేస్తున్న క్రమంలో చిన్నారులని పై అంతస్తు నుంచి కింది అంతస్తుకి చేతుల ద్వారా తీసుకున్నారు. మరికొందరు బాల్కని నుంచి సిబ్బంది ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్‌లోకి దూకారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్‌మెంట్‌ పైనుంచి పిల్లలు, మహిళలు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read: కసబ్‌ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్‌ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?

 

telugu-news | national-news | fire accident

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు