/rtv/media/media_files/2025/05/05/kWPPPGxSm6VmeIZXaURU.jpg)
A girl calls an MLA in the name of jobs in Gulf countries.
Employment Fraud : గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వహకుల గుట్టు రట్టయింది. ఏకంగా ఎమ్మెల్యేకు పోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో కంగుతినడం ఆయన వంతయ్యింది. వెంటనే సదరు ఎమ్మెల్యే పోలీసులను అప్రమత్తం చేయడంతో ముఠా గుట్టురట్టయింది. జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
వివరాల్లోకి వెళితే.. సారంగాపూర్ మండలం రంగంపేటకు చెందిన నవీన్ జగిత్యాలలో ఓ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. గల్ఫ్ దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నాడు. ఇందుకోసం ఓ యువతిని నియమించుకుని ఫోన్ చేయిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రోజూలాగే నవీన్ ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఆ యువతి ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దని తెలియక గల్ఫ్ లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని నమ్మబలికింది.
ఇది కూడా చదవండి: Miss World 2025: హైదరాబాద్‌కు అందాల తారలు.. ఫొటోలు చూశారా?
ఈ క్రమంలోనే సదరు అమ్మాయి ఎమ్మెల్యే అది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని తీయ్యగా మాట్లాడి మోసం చేసే ప్రయత్నం చేసింది. ముందు డబ్బులు పంపించాలని కోరింది. ఈ దందాపై తనకు ఎందుకు ఫోన్ చేశావని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియక యువతి ఎమ్మెల్యేపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు ట్రావెల్స్‌పై దాడి చేసి, ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి నవీన్‌ను అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీల గురించి పూర్తిగా తెలిస్తేనే డబ్బులు చెల్లించాలని సూచిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
కాగా తెలంగాణలోని అమాయక ప్రజల నుంచి కొంతమంది ఏజెంట్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ వీసాలు, తప్పుడు ఉద్యోగ ఒప్పందాలు సృష్టించి నిరుద్యోగులను మోసగిస్తున్నారు. చాలా మంది బాధితులు గల్ఫ్‌కు చేరుకున్న తర్వాత అక్కడ ఉద్యోగాలు, జీతాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరిని అక్రమంగా తరలించి అక్కడ బందీలుగా చేసి చిత్రహింసలు పెడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.మోసగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులు తమ డబ్బులు కోల్పోవడమే కాకుండా, భవిష్యత్తుపై ఆశలు కూడా వదులుకుంటున్నారు. ఈ మోసాల వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని, నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్