Wanaparthy District: చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు.. వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే!?

చనిపోయాడనుకున్న వ్యక్తి ..లేచి కూర్చున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని తైలం రమేష్ అనే వ్యక్తి మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరినిమిషంలో ఆయన శరీరంలో కదలికలు చూసి ఆసుపత్రికి తరలించగా బతికాడు.

New Update
Wanaparthy

Wanaparthy

చనిపోయాడనుకున్న వ్యక్తి ..లేచి కూర్చున్న సంఘటన వనపర్తి జిల్లా(wanaparthy) కేంద్రంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రానికి చెందిన తైలం ర‌మేశ్‌ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డిని వెన్నంటి ఉన్నారు. ఆయ‌న‌కు అభిమానిగా మారారు తైలం ర‌మేశ్‌. ఆ అభిమానాన్ని త‌న గుండెల్లో చాటుకున్నారు. త‌న ఛాతీపై నిరంజ‌న్ రెడ్డి ప‌చ్చబొట్టు కూడా వేయించుకున్నాడు ర‌మేశ్‌. 

Also Read: ట్రంప్‌ను జోకర్ చేసిన పుతిన్.. మోదీ, జిన్‌పింగ్‌పై ప్రశంసలు

A Man Died But Sits Up

అయితే గత కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌(Hyderabad) లో ఉంటున్నారు. వినాయక చవితి(Vinayaka Chavithi 2025) సందర్భంగా వనపర్తికి వచ్చాడు. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట డబుల్ బెడ్రూం కాల‌నీలో ఉంటున్న త‌న బంధువుల ఇంటికి వ‌చ్చాడు.  శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన రమేష్‌ ఉదయం కుటుంబసభ్యులు లేపేందుకు ప్రయత్నించగా ఎంత పిలిచిన లేవలేదు. అయితే ఆయన నిద్రలోనే చనిపోయాడనుకున్న కుటుంబ సభ్యులు ఆయన అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చూడండి:Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు

ఇదిలా ఉండగా త‌న అభిమాని చ‌నిపోయాడ‌న్న విష‌యం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి.. చివ‌రిచూపు కోసం రమేష్‌ ఇంటికి వ‌చ్చారు. ఈ సందర్భంగా ర‌మేశ్ ఛాతీపై ఉన్న త‌న ప‌చ్చబొట్టును చూపిస్తూ కుటుంబ సభ్యులు రోదించారు, అయతే ఆ పచ్చబొట్టును చూస్తున్న క్రమంలో రమేష్‌ ఊపిరి పీల్చుకుంటున్నట్టు నిరంజ‌న్ రెడ్డి ప‌సిగ‌ట్టారు. దీంతో త‌క్షణమే ర‌మేశ్‌పై ఉన్న పూల‌మాల‌లు తీయించి రమేష్‌ అని గట్టిగా పిలిచారు. ఆయనలో మరింత కదలిక కనిపించింది. వెంట‌నే స్పందించిన ఆయన రమేష్‌ను ఆస్పత్రికి త‌ర‌లించాలని సూచించారు. వెంటనే ఆయనను  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించ‌డంతో.. గంట త‌ర్వాత స్పృహ‌లోకి వ‌చ్చి క‌ళ్లు తెరిచాడు. వైద్యుల సూచ‌న మేర‌కు నిమ్స్‌(NIMS) కు త‌ర‌లించి.. అత‌ని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ర‌మేశ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. తన అభిమాన నేత పచ్చబొట్టే తనను కాపాడిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ రెండు యాప్స్ మీ మొబైల్‌లో ఉండాల్సిందే!

Advertisment
తాజా కథనాలు