Jagga Reddy: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

New Update
sangareddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి(sangareddy) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(jagga-reddy) పై ఎన్నికల సంఘం(ec) ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి వినయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇంద్రానగర్ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఈ గొడవలో జగ్గారెడ్డిని మొదటి నిందితుడిగా (A1), ఆయన అనుచరుడు హమీద్ ను రెండో నిందితుడిగా (A2) ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వీరిపై BNS యాక్ట్ లోని వివిధ కఠిన సెక్షన్లతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టారు.

Also Read :  GHMC : మహానగరం మూడు కార్పొరేషన్లు.. మీ ఏరియా ఇప్పుడు ఏ కార్పొరేషన్లో ఉందంటే?

అసలేం జరిగిందంటే..  

పోలింగ్ కేంద్రంలోకి హమీద్ అనే వ్యక్తి పదేపదే మొబైల్ ఫోన్ తీసుకుని వస్తుండటంతో అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ అతడిని వారించారు. లోపలికి రావొద్దని చెప్పినందుకు హమీద్ ఎన్నికల సిబ్బందిని బెదిరించడమే కాకుండా, పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. నేను జగ్గారెడ్డి మనిషిని, నన్నే ఆపుతారా అంటూ అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తా అంటూ బెదిరింపులకు దిగాడు.

ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ను ఆపే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండావిధుల్లో ఉన్న సీఐ శివకుమార్ పై దాడికి ప్రయత్నించి, అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నీ అంతు చూస్తా అంటూ తనను జగ్గారెడ్డి భయభ్రాంతులకు గురిచేశారని సీఐ శివకుమార్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివరించారు. 

అయితే, ఈ కేసుపై స్పందించిన జగ్గారెడ్డి.. దొంగ ఓట్లను అడ్డుకున్న తమ పార్టీ నేతపై సీఐ చేయిచేసుకోవడం వల్లే తాను తిట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. సదరు అధికారి బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, అసలు తప్పు ఎవరిదనేది కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Also Read :  బ్రిటిష్ చట్టసభలోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజు అరుదైన గౌరవంతో రికార్డ్

Advertisment
తాజా కథనాలు