Dharani Portal: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!

ధరణి పోర్టల్‌ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ జరపాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారు.

Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?
New Update

Dharani Portal: గత ప్రభుత్వం భూముల రికార్డుల కోసం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ పై అనేక ఫిర్యాదులు వచ్చిన  సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధరణిపై సంచలన స్కామ్ బయటకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ను ప్రవేశ పెట్టిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత అధికారులు ఈ ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని.. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారాని ఆరోపణలు వచ్చాయి. 

Also Read:  Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత..

ఈ క్రమంలోనే  దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి వెళ్ళాయాని రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. ఈ భూదందాపై విచారణ  జరిపించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్ తో పాటు పలు విచారణ ఏజెన్సీలకు లేఖ రాసినట్లు సమాచారం. 

Also Read:  US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

1000 ఎకరాల వరకు...

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నెంధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!
బర్  63లోని 42ఎకరాలు, గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్  124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్  36, 37లో 600 ఎకరాలు, హఫీజ్‌పేట సర్వే నెంబర్  80లో 20 ఎకరాలు, మోఖిలా దగ్గర సర్వే నెంబర్  555లో బిల్లాదాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి మండలం యల్లమ్మబండ(షాంబిగూడ) పరిధిలో సర్వే నెంబర్  57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్‌ కమిషన్‌కు రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నారు. చేతులు మారిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Also Read: New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..!

Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!


 

#telangana #dharani-portal #dharani #Golmaal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe