TCS: ఆఫీసుకొస్తేనే బొనస్ ఇస్తానంటున్న టీసీఎస్! ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొంత మంది సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక బోనస్ లలో కోత విధించింది. కంపెనీ ఉద్యోగుల హాజరు, యూనిట్ పనితీరుకు అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బోనస్ చెల్లింపులను తగ్గించినట్లు సమాచారం. By Bhavana 10 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి TCS: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొంత మంది సీనియర్ ఉద్యోగుల త్రైమాసిక బోనస్ లలో కోత విధించింది. అంతక్రితం త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అవుట్ ను ప్రకటించిన సంస్థ, తదుపరి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఉద్యోగుల వేరియబుల్ పేను కార్యాలయంలో హాజరు, యూనిట్ పనితీరుకు అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బోనస్ చెల్లింపులను తగ్గించినట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. Also Read: Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. జూనియర్ ఉద్యోగులకు పూర్తి వేరియబుల్ పే ఇస్తుండగా..కొంతమంది సీనియర్ ఉద్యోగులకు 20-40 శాతం, మరికొందరికి 100 శాతం దాకా ఇందులో కోత వేశారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో కార్యాలయానికి వచ్చే రోజులను వేరియబుల్ పే చెల్లింపునకు అనుసంధానం చేశాక కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు తమ ఉద్యోగుల్లో 70 శాతం మంది కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నారని గత జులైలోనే కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్యాలయ హాజరు60-75 శాతం ఉన్నవారికి 50 శాతం, హాజరు 75-85 శాతం ఉంటే 75 శాతం బోనస్, హాజరు 85 శాతం పైన అయితే పూర్తి వేరియబుల్ పే అందుతుంది. Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! అయితే ఇటీవల జులై-సెప్టెంబర్ క్వార్టర్ లో మాత్రం అలా జరగలేదని తెలుస్లోంది. ఈ త్రైమాసికానికి గానూ టీసీఎస్.. చాలా మంది సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ పెర్ఫామెన్స్ బోనస్‌లో కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇంకా డిమాండ్ పూర్తి స్థాయిలో అందుకోలేదని.. అందుకే కోతలు పెట్టినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు తెలిపాయి. Also Read: BREAKING: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్! ఉద్యోగుల్ని కచ్చితంగా వారంలో అన్ని రోజులు ఆఫీసులకు రప్పించేందుకు.. టీసీఎస్ కొన్ని నెలల కిందట వేరియబుల్ పేను ఆఫీస్ అటెండెన్స్‌కు లింక్ చేసిన సంగతి తెలిసిందే. దీని కింద అటెండెన్స్ శాతాన్ని బట్టి వేరియబుల్ పేలో కోతలు ఉంటాయని ప్రకటించింది. 85 శాతం అటెండెన్స్ ఉంటేనే.. ఫుల్ వేరియబుల్ పే ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికి అదనంగా మళ్లీ ఇంటర్నల్ బిజినెస్ యూనిట్ వైస్ పెర్ఫామెన్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి