Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. వైజాగ్ లో ప్రస్తుతం ఉన్న గేట్ వే హోటల్‌ను కూల్చి వేసి.. దాని స్థానంలో 24 అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించే దిశగా వరుణ్ గ్రూప్ అడుగులు వేస్తోంది. విశాఖ బీచ్ రోడ్‌లో ఇదే తొలి స్క్రై స్క్రాపర్. By Bhavana 10 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vizag: వైజాగ్...ఏపీలో అతి పెద్ద నగరం మాత్రమే కాదు...అతి పెద్ద టూరిస్ట్ ప్లేస్ కూడా. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి వైజాగ్ వస్తోన్న పర్యాటకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతున్నారు. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు తాజ్ గేట్ వే హోటల్‌ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి రూ.120 కోట్లకు వరుణ్ గ్రూప్ దక్కించుకుంది. ఇక్కడ 24 అంతస్థుల ప్రీమియం ఆఫీసు స్పేస్, హోటల్ కమ్ స్టూడియోను నిర్మించడానికి సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం వరుణ్ గ్రూప్ రూ.600 కోట్లు వెచ్చించనుంది. దీని పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్ కూడా వరుణ్ గ్రూప్‌కు చెందినదే. రూ నవంబర్ 14వ తేదీ నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! తొలి స్క్రై స్క్రాపర్.. ఇప్పుడు కట్టబోయే హోటల్ నుంచి సాగర తీర అందాలను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. విశాఖ బీచ్ రోడ్‌లో ఇదే తొలి స్క్రై స్క్రాపర్. తాజ్ గేట్ వే హోటల్‌ను మొదట్లో సీ పెరల్ హోటల్‌గా వ్యవహరించేవారు. తర్వాత ఇది తాజ్ హోటల్ అయ్యింది. ప్రస్తుతం గేట్ వే హోటల్‌గా ఉంది. ఈ హోటల్‌ను త్వరలోనే కూల్చేస్తారని సెప్టెంబర్లోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుంది.విశాఖ పరిసర ప్రాంతాల్లో పలు ప్రముఖ హోటళ్లు, రిసార్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఏఎంటీజెడ్ సమీపంలో రాడిసన్ బ్లూ రానుండగా.. సన్ రే రిసార్ట్స్‌ను మరింత విస్తరిస్తున్నారు. ఒబేరాయ్ హోటల్స్, మేఫెయిర్ హోటల్, తాజ్ హోటల్‌లు త్వరలోనే విశాఖలో అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. Also Read: USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు వరుణ్ గ్రూప్ కూడా విశాఖలో మరిన్ని హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతోంది.విశాఖపట్నం లేదా అనకాపల్లి జిల్లాలో హోటల్ నిర్మాణానికి తాజ్ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది. స్థలం ఎంపిక కోసం కంపెనీ ప్రతినిధులు కొద్ది రోజులుగా అన్వేషణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని పలు ప్రాంతాలతోపాటు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పరిసర ప్రాంతాలను తాజ్ ప్రతినిధులు ఇప్పటికే పరిశీలించారు. సముద్ర తీరానికి చేరువగా హోటల్ నిర్మించేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోందని సమాచారం. Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ గతేడాది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా.. భీమిలీలో లగ్జరీ విల్లాల నిర్మాణానికి ఒబేరాయ్ గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా లగ్జరీ రిసార్టులు డెవలప్ చేయడానికి తాజ్ గ్రూప్ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. #vizag beach road #varun group #taj gateway hotel demolition #visakhapatnam taj gateway hotel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి