/rtv/media/media_files/2025/11/07/55-cyber-fraudsters-held-in-hyderabad-in-october-2025-11-07-16-22-43.jpg)
55 Cyber Fraudsters Held in Hyderabad in October
సైబర్ క్రైమ్ రోజురోజుకు పెరిగిపోతుంది. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్లు దండుకుంటున్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు. అలాగే బాధితులకు 62.34 లక్షలు అప్పగించారు.
Also Read: మీరు సంతోషంగా పదవీ విరమణ చేయలేరు.. ఈసీ అధికారులపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు!
సైబర్ నేరగాళ్ల బ్యాంకు అకౌంట్లలో రూ.107 కోట్ల లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా వివిధ కేసులకు సంబంధించి ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 55 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. చైనా పౌరుల నుంచి ఈ డిజిటల్ అరెస్టు స్కామ్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ 62 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.07 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గత నెలలో పోలీసులు ఆ సైబర్ ముఠాను అరెస్టు చేశారు.
Also Read: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం
అలాగే ఏపీలో ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి రూ.24.17 లక్షలు మోసం చేయగా.. అతడిని అరెస్టు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్టు, సోషల్ మీడియా ఫ్రాడ్‌ల ద్వారా ఏకంగా 33 సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు చెప్పారు. సైబర్ నిందితుల నుంచి 31 సెల్‌ఫోన్లు, 9 డెబిట్ కార్డులు , 14 చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా చాలామంది సైబర్ నేరగాళ్ల చేతిలో ఏదో విధంగా మోసపోయారు. ఈ క్రమంలోనే నెల వ్యవధిలో పోలీసులు 55 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్
Follow Us