Priyanka Gandhi : మీరు సంతోషంగా పదవీ విరమణ చేయలేరు.. ఈసీ అధికారులపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ రెగాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.

New Update
priyanka

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ రెగాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఆమె నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తో పాటుగా మరో ఇద్దరు అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వేదికపై నుండి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..  CEC జ్ఞానేష్ కుమార్‌కు గట్టి హెచ్చరిక చేస్తూ, "జ్ఞానేష్ కుమార్, మీరు ప్రశాంతంగా పదవీ విరమణ చేస్తారని అనుకుంటే, అది జరగదు. ప్రజలారా, జ్ఞానేష్ కుమార్ పేరును ఎన్నటికీ మర్చిపోకండి" అని అన్నారు. ఆమె ఎస్.ఎస్. సంధు, వివేక్ జోషిపేర్లను కూడా ప్రస్తావించి, వారి పేర్లను గుర్తుంచుకోవాలని ప్రజలను కోరారు. దీంతో  కాంగ్రెస్ శ్రేణులు చోర్-చోర్ (దొంగ-దొంగ) అంటూ పెద్దగా నినాదాలు చేశారు.

ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే

హర్యానాలో ఓట్లను ఎలా తారుమారు చేశారనే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఓట్ల అవకతవకల ఆరోపణలను ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు క్షమించరని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా తప్పు చేసినట్లయితే, జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్. సంధు, వివేక్ జోషి సహా అందులో పాలుపంచుకున్న వారు ప్రశాంతంగా పదవీ విరమణ చేయలేరని ఆమె తన హెచ్చరికను పునరుద్ఘాటించారు.

కాగా ప్రియాంక గాంధీ కంటే ముందు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలను తారుమారు చేయడానికి 25 లక్షల నకిలీ ఓట్లను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తగ్గించారని, తన వ్యాఖ్యలు వందశాతం నిజం" అని ఆయన నొక్కి చెప్పారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. 121 నియోజకవర్గాల్లో జరిగింది.నవంబర్ 11న మిగిలిన 122 నియోజకవర్గాల్లో జరగనుంది. నవంబర్ 14న అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisment
తాజా కథనాలు