GROUP 3: సగం మంది గ్రూప్‌ 3 పరీక్షలకు డుమ్మా

గ్రూప్‌ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్‌-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది.

New Update
kkk

గ్రూప్‌ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్‌-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 71.30 శాతం మంది హాజరయ్యారు. అత్యల్పంగా వరంగల్ జిల్లాలో 49.93 శాతం మంది హాజరయ్యారు. అయితే ఈ గ్రూప్‌ -3 నొటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Also Read: గ్రూప్-3లో కులంపై వివాదాస్పద ప్రశ్న.. RS ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!

తెలంగాణ వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ సగం మంది అభ్యర్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. ఇదిలాఉండగా మొదటగా 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా జోడించడంతో వాటి సంఖ్య 1375కు పెరిగింది. 

Also Read: లగచర్ల ఘటన మణిపుర్‌ కన్నా తక్కువ కాదు.. రాహుల్‌పై కేటీఆర్‌ ఫైర్

ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీనివల్ల మరోసారి 13 పోస్టులు అదనంగా కలిశాయి. మొత్తంగా గ్రూప్‌ 3 ఉద్యోగాల సంఖ్య 1,388కి చేరింది. అయితే ఈ పరీక్షలకు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటే అందులో 50 శాతం మందే పరీక్షలు రాయడం గమనార్హం. 

Also Read: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Also Read: మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్‌ షా కీలక నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు