గ్రూప్-3లో కులంపై వివాదాస్పద ప్రశ్న.. RS ప్రవీణ్ తీవ్ర అభ్యంతరం!

గ్రూప్-3 పరీక్షలో తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలతో కూడిన ప్రశ్నలను అడగడంపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రశ్నాపత్రాల్లోనే ఇలాంటి పదాలు ఉంటే సామాజిక న్యాయం ఎలా సాధ్యమంటూ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు.

New Update
RS Praveen Group-3

ఈ రోజు నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలో తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలతో కూడిన ప్రశ్నలను అడగడంపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఫైర్ అయ్యారు. తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇంక సామాజిక న్యాయం ఎట్ల వస్తది రేవంత్ రెడ్డి గారూ? అంటూ ప్రశ్నించారు. మీ సమీకృత విద్యా విధానం చిలుక పలుకులు కేవలం వట్టి మాటలే, నీటి మూటలే అంటూ విమర్శించారు.  

Also Read:  పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే?

Also Read:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

ప్రశ్న ఇది..

గ్రూప్-3 ప్రశ్నాపత్రంలో భారతదేశంలో సంస్కృతీకరణపై కింది ప్రకటనలలో ఏవి సరైనవి? అంటూ ప్రశ్న వచ్చింది. ఇందుకు 3 ఆప్షన్లు ఇచ్చారు. 
A. తక్కువ కులానికి చెందిన సభ్యులు తమ పద్ధతులు మరియు ఆచారాలను సమిష్టిగా మార్చుకునే ప్రక్రియను ఇది సూచిస్తుంది.
B. ఈ ప్రక్రియలో భాగంగా, తక్కువ కులానికి చెందిన సభ్యులు ఉన్నత కులం యొక్క జీవన విధానాలను సమిష్టిగా అనుకరిస్తారు. 
C. సంస్కృతీకరణ ద్వారా, తక్కువ కులానికి చెందిన సభ్యులు కుల వ్యవస్థ నుండి సమిష్టిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తారు.

Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు!

ఈ ప్రశ్నలో తక్కువ కులం, ఉన్నత కులం అంటూ పదాలు ప్రస్తావించడం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. పలువురు ఈప్రశ్నపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై TGPSC ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Also Read: Hyderabad Food: ఫుడ్‌ క్వాలిటీలో హైదరాబాద్‌ లాస్ట్‌...!

Advertisment
Advertisment
తాజా కథనాలు