లగచర్ల ఘటన మణిపుర్ కన్నా తక్కువ కాదు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదన్నారు. By B Aravind 18 Nov 2024 | నవీకరించబడింది పై 18 Nov 2024 18:45 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ కూడా ఆయన ఇదే అంశంపై మాట్లాడారు. ''అర్థరాత్రి వచ్చిన పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తూ లైంగిక దాడులు, శారీరకంగా ఎలా హింసించారన్నది వాళ్లు వివరంగా చెబుతున్నారు. కొడంగల్‌లో ఓటు వేసి నిన్ను ముఖ్యమంత్రి చేసినందుకు మమ్మల్ని అర్థరాత్రి కరెంట్ తీసేసి అరెస్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తున్నారు. 9 నెలల గర్బిణీ అయిన జ్యోతి అనే మహిళ భర్తను దారుణంగా కొట్టి అరెస్ట్ చేశారు. బాధితులను బెదిరిస్తున్నారు రేవంత్ సర్కార్ చేసిన అఘాయిత్యాలను మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారు. భూములు ఇవ్వకుంటే మీరు ఏ విధంగా భూములు ఇవ్వారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మీ అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం మా గిరిజనులు భూములు కోల్పోవాలా అని అమాయక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రైతులను కొట్టిన, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆవేదనతో కోరుతున్నారు. Also Read: లగచర్లలో కలెక్టర్ పై దాడి.. ఆ పోలీస్ అధికారిపై వేటు! తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా ?. పేద, గిరిజన రైతుల భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా గుంజుకుంటున్నాడు. మణిపూర్‌లో హింస, యూపీ హాస్పిటల్ లో చిన్న పిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తోంది. కానీ తెలంగాణలో గిరిజనులపై అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా అరాచకాలు జరుగుతున్నాయి. మణిపుర్ కన్నా ఏమాత్రం తక్కువ కాదు కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ, చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదు. రేవంత్ సోదరుడు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి కలెక్టర్ వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతాడు. పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీని అడుగుతున్నాం. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు. గిరిజనులపై పోలీసులు చేస్తున్న దాడులపై రాహుల్ గాంధీ, మోదీ ఎందుకు స్పందించటం లేదు. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరిచిపోయారా?. లగచర్లలో రైతులు చనిపోయే వరకు స్పందించారా ?. మణిపూర్‌లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చేపట్టం కాదు.. మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపండి. భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగవద్దని మీరే భూ సేకరణ చట్టం తెచ్చారు. కానీ తెలంగాణలో గిరిజనుల భూముల విలువ రూ. 60 లక్షలు అయితే మీరు రూ.10 లక్షలు ఇస్తామంటే ఎలా ?. ఈ అంశంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. రాజ్యసభలో కచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ పేదల తలరాత మారుస్తామంటూ పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారు. కానీ అదానీ, రేవంత్ రెడ్డి, మీ పార్టీ తలరాత మార్చుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. Also Read: లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ వార్నింగ్ దాదాపు 30 మంది రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. సంగారెడ్డి జైల్లో మేము వెళ్లి వారిని చూశాం. నడవలేకపోతున్నారు. అందుకే ఈ అఘాయిత్యాలను మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ మహిళా కమిషన్‌కు వారు ఫిర్యాదు చేశారు. కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకముంది. దేశంలోని అతి పెద్ద సంస్థలకు ఫిర్యాదు చేశాం. అఘాయిత్యాలకు పాల్పడిన పోలీసులకు నోటీసులు ఇస్తారని నమ్మకం ఉంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయమని చెబుతారని ఆశిస్తున్నా. మేము కూడా ఫార్మాసిటీ కోసం దాదాపు 14 వేల ఎకరాల భూమి సేకరించాం. మేము భూసేకరణ చేసినప్పుడు కూడా సమస్యలు వచ్చాయి. కానీ మేము రైతులను ఒప్పించి, మెప్పించి వారికి సరైన పరిహారం ఇచ్చాం. గతంలో మేము ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటే అది విషం అంటూ ఇదే రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విషన్ని పేద ప్రజల్లో ఊళ్లలో ఎందుకు నింపుతున్నారు. మీరు గతంలో చెప్పిన కాలుష్యం గురించే జ్యోతి అనే మహిళ ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ పేరుతో కాలుష్యాన్ని డీ సెంట్రలైజ్ చేస్తున్నారు. భూములు ఇవ్వమని సంగారెడ్డి లో కూడా రైతులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్ గా మార్చేస్తున్నాడని'' కేటీఆర్ అన్నారు. #telangana #telugu-news #ktr #lagacharla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి