తెలంగాణలో మూడు కీలక బిల్లులు ఆమోదం..

తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది.

New Update
Assembly

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ జరపాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మంగళవారం జరిగిన సమావేశాల్లో కూడా ఈ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, బీపీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అధికార పక్షం మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించింది. 

Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ మూడు బిల్లులకు ఆమోదం లభించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై కూడా కొంతసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత సభ బుధావారానికి వాయిదా పడింది. ఇదిలాఉండగా.. సభను బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్‌ పర్మిషన్‌తో అప్పులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలు నిర్వహించగా.. హరీశ్‌రావు, భట్టి విక్రమార్క మధ్య వాదనలు కొనసాగాయి.  

Also Read: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.27 కోట్లు అప్పులు చేసిందని హరీశ్‌ రావు ఆరోపించారు. వీళ్ల ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి అప్పులు 6.36 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారంటూ ధ్వజమెత్తారు.  తమ హయాంలో రూ.4,17,496 కోట్లు మాత్రమే అప్పు ఉందని .. కానీ రూ.7లక్షల కోట్లకు పైగా మేము అప్పులు చేశామంటూ ప్రచారం చేశారని ఆరోపించారు. 

ఆ తర్వాత భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని సభలోనే శ్వేతపత్రం కూడా విడుదల చేశామని తెలిపారు. తాము ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదని అన్నారు. స్పీకర్ పర్మిషన్‌తో ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

Also Read: 22 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో చిక్కుకున్న మహిళ.. ఎట్టకేలకు భారత్‌లోకి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు