Tirupati stampede: తిరుపతి తొక్కిసలాట...జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం
వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమించింది. ఈ మేరకు న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.